పానగల్ లో పల్స్ పోలియో అవగాహన ర్యాలీ!

పానగల్ : ఈనెల 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యాధికారిణి డాక్టర్ మైథిలి పిలుపునిచ్చారు. పానగల్ మండల కేంద్రంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలియో మహమ్మారి నుండి పిల్లలను రక్షించేందుకు పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
