పానగల్ : నేడు విద్యుత్తులో అంతరాయం

పానగల్ మండలంలో విద్యుత్ అంతరాయం ఉంటుందని మండల ఏఈ చందన్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని 33/11కెవి సబ్ స్టేషన్లో కొత్త ట్రాన్స్ఫార్మర్ పెడుతుండటం వల్లన సోమవారం ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని మండల ఏఈ చందన్ రెడ్డి తెలిపారు. గోప్లాపూర్, కిష్టాపూర్, అన్నారం, గూడెం, బండపల్లి, జమ్మాపూర్, మాధవరావుపల్లి, దావాజిపల్లి గ్రామాలకు విద్యుత్‌లో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. మండల కేంద్రంతోపాటు గ్రామాల ప్రజలు సహకరించాలని ఏఈ కోరారు.
