మాడుగులపల్లిలో మన గ్రోమోర్ ఎరువులు, పురుగుమందుల దుకాణం ప్రారంభం

ధర్మఘంట ఆగస్టు 22 మాడుగులపల్లి:
మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మన గ్రోమోర్ ఎరువులు, పురుగుమందుల దుకాణాన్ని జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, జగదీశ్వర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు శనివారం ఘనంగా ప్రారంభించారు, మండల కేంద్రంలోనే ఈ దుకాణం అందుబాటులోకి రావడం పట్ల స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేష్, సర్పంచ్ అరూరి నరేష్, ఉప సర్పంచ్ మల్లేపల్లి వెంకన్న, సీపీఎం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి శివకుమార్, మన గ్రోమోర్ సిబ్బంది మురళి, కృష్ణంరాజు, జోనల్ హెడ్ రాజేష్, జోనల్ మార్కెటింగ్ మేనేజర్ శేషు, నల్గొండ ఏరియా మేనేజర్ అశోక్, మాడుగులపల్లి మన గ్రోమోర్ సెంటర్ మేనేజర్ నాగార్జునతో పాటు పరిసర గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
