సూర్యాపేట జిల్లాలో ఘనంగా మేడే వేడుకలు
కాంగ్రెస్ పార్టీ కార్మికలకు అండగా వుంటుంది

సూర్యాపేట : ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా సూర్యపేట జిల్లాలో పలు వార్డులలో జెండా ఎగురవేసి మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిలు గా ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి , డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య లు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూకాంగ్రెస్ పార్టీ కార్మికులకు అండగా ఉంటుందని కార్మికుల సమస్యలపై నిరంతరము కాంగ్రెస్ పార్టీ అనుబంద సంఘం ఐఎన్ టియుసి ఆద్వర్యంలో పోరాటం చేస్తామని వారు అన్నారు. మే డే సందర్భంగా శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని జమ్మిగడ్డ లో గల విద్యుత్ కార్యాలయం వద్ద ఐఎన్ టియుసి ఆధ్వర్యంలో జరిగిన మేడే ఉత్సవాల్లో పాల్గొని వారు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్మాణం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అనుబంద సంఘాలకు ప్రత్యేకంగా కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని, అలాగే ఐఎన్ టియుసికి కూడా కార్యాలయము ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫి వుల్లా, ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలి, జిల్లా యూత్ కాంగ్రెస్ అద్యక్షులు ఎలిమినేటి అభినయ్, నాయకులు చింతమల్ల రమేష్,అబ్దుల్ రహీం, వీరన్న నాయక్, బైరు వెంకన్న, పోలగాని బాలు గౌడ్, బండారు వెంకన్న, అన్నమయ్య రాము,నరేందర్ నాయుడు, కోడి శివ, పంతంగి దశరథ,చొక్కయ్య, కౌన్సిలర్ లు కొండపల్లి దిలీప్ రెడ్డి, నాగుల వాసు, రాపర్తి శ్రీను, టిఎస్ ఇ సంఘం నాయకులు దశరధ రెడ్డి, బూర్గుల వెంకన్న, వీర మల్లు, రాము తదితరులు పాల్గొన్నారు.
బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో: మే డే ను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని విద్యుత్ సర్కిల్ వద్ద జెండాను గురువారం ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి బెల్లంకొండ భరత్, డివిజన్ అధ్యక్షుడు కుంభం ఉపేందర్, కార్యదర్శి కృష్ణారావు, జిల్లా నాయకులు శ్రీనివాసరావు, మధు, శ్రీకృష్ణ, గంగరాజు, నాగరాజు, వెంకటేష్, శివ, తదితరులు పాల్గొన్నారు
వాటర్ సప్లై కార్యాలయం లో మే డే వేడుకలు
మున్సిపల్ వాటర్ సప్లై కార్యాలయం వద్ద జరిగిన వేడుకలలో ఎఐ సిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఐఎన్ టి యు సి జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వాటర్ సప్లై యూనియన్ గౌరవ అధ్యక్షులు కక్కిరేణి శ్రీనివాస్, అద్యక్షులు సయ్యద్ సమి, కార్యదర్శి గుండా నాగరాజు, కోశాధికారి పటాని శ్రీనివాస్, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఆర్డీఆర్ టూర్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు
సూర్యాపేట: టూర్, ట్రావెల్స్ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఐఎన్ టియుసి అండగా ఉంటుందని ఎసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, డిసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద మే డే దినోత్సవ సందర్భంగా రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి టూర్ & ట్రావెల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై జండా ఆవిష్కరించి మాట్లాడారు. టూర్ ట్రావెల్స్ కార్మికులకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతే మా దృష్టికి తీసుకు వస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ, కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా మాజీ అధ్యక్షుడు కాసాని పాపయ్య గౌడ్, టూర్ అండ్ ట్రూ ట్రావెల్స్ యూనియన్ పట్టణ అధ్యక్షులు షారుక్, జంగ మహేష్, బడుగుల చంద్రశేఖర్, పెరుమాళ్ల ప్రవీణ్, మొండి కత్తి వెంకన్న, ఎండి ముజ్జి బాయ్, షేక్ సిద్ధిక్,గోదాల సైదులు, కప్పల ఉపేందర్, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
సెంట్రింగ్ యూనియన్ ఆద్వర్యంలో మే డే వేడుకలు
సెంట్రింగ్ యూనియన్ ఆద్వర్యంలో జరిగిన మేడే వేడుకలలో ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
సెంట్రింగ్ యూనియన్ గౌరవ అధ్యక్షులు నిమ్మల వెంకన్న, అద్యక్షులు ఎస్ కె మహమ్మద్ రఫి, ఉపాద్యక్షులు నక్కల శ్రీనివాస్, ప్రదాన కార్యదర్శి నర్సింగోజు రాంబాబు, కోశాదికారి ఎస్ కె సిద్దావలి, జాయింట్ సెక్రటరీ బండారు సైదులు తదితరులు పాల్గొన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుంది
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందని ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బస్ డిపోవద్ద ఐఎన్ టియుసి డిపో కమిటీ కార్యదర్శి డిఆర్ కుమార్ ఆధ్వర్యంలో మేడేే సందర్భంగా జెండా ఆవిష్కరించిన అనంతరం సిఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఎం భాస్కర్, ఆర్ సైదులు, ఆర్ వి సింగ్, ఎంఎ బేగ్, యాకమ్మ, అనిల్ కుమార్, ఎండి గని, శంకర్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
పబ్లిక్ హెల్త్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్
31 94 ఆధ్వర్యంలో
మేడే వేడుకలను జిల్లా కేంద్రంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ 31 94 ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జెండాను ఏఐసీసీ సభ్యుడు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకోవడంలో వైద్య సిబ్బంది తమదైన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, డి ఎం హెచ్ వో వెంకటరమణ, రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ రాజేశ్వరరావు పట్టణ అధ్యక్షుడు అంజలి ఐఎన్టీయూ అధ్యక్షుడు బాలకృష్ణ చొక్కాయ్య ఆ సంఘం అధ్యక్షుడు అధ్యక్షుడు మనోజ్ రెడ్డి సెక్రటరీ విజయలక్ష్మి శ్రీనివాస్ ప్రసాద్ రమణ రమేష్ చంద్రశేఖర్ శ్రీను లింగయ్య పాల్గొన్నారు.



