రోడ్డు ప్రమాద బాధితులకు అత్యాధునిక పాలి ట్రామా కేర్
యశోద హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కిరణ్ కె, రెడ్డి బాదం
అసాధ్యం అనుకున్న కేసుల్లోనూ అవయవాల పునరుద్ధరణ

యశోద హాస్పిటల్ సోమాజిగూడ లో రోబోటిక్ టెక్నాలజీతో లింబ్ సాల్వేజ్ చికిత్స
ధర్మఘంట ఏప్రిల్ 24,సూర్యాపేట:రోడ్డు ప్రమాద బాధితులకు అత్యాధునిక పాలి ట్రామా కేర్ మరియు రోబోటిక్ ప్రిసిషన్ సర్జరీ ద్వారా పునర్జన్మ కల్పిస్తున్నట్లు యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ట్రామా రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్, స్పోర్ట్స్, ఆర్దోస్కోపి, ఇలిజరోవ్, కైపోస్కోలియోసిస్, ఎండోస్కోపిక్ స్పైనల్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ వైద్యులు డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి బాదం అన్నారు. జిల్లా కేంద్రంలోని ఖమ్మం రోడ్ లో జయ భాస్కర్ ఇన్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రాణాంతకమైన రోడ్డు ప్రమాదాలు సంఖ్య నానాటికి పెరుగుతుందని ఇటువంటి ప్రమాదాల్లో బాధితులు పాలి ట్రామా శరీరంలో ఒకేసారి అనేక కీలక అవయవాలకు గాయాలు బారిన పడుతుంటారని కాళ్లు చేతులు నుజ్జు నుజ్జు అవ్వడం లేదా తీవ్రమైన ఎముకల ఫ్రాక్చర్ల వలన చాలా సందర్భాల్లో అవయవాలను తొలగించాల్సి వస్తుందని వైద్యరంగంలో వస్తున్న విప్లవాత్మగా మార్పులను అందిపుచ్చుకుంటూ యశోద హాస్పిటల్ సోమాజిగూడ తమ అధునాతన లింబ్ సాల్వేజ్ అండ్ రీ కన్స్ట్రక్షన్ విభాగం ద్వారా అసాధ్యం అనుకున్న కేసుల్లో కూడా అవయవాలను కాపాడే బాధితులకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తునట్లు తెలిపారు. హై ప్రిసిషన్ రోబోటిక్ టెక్నాలజీతో సంక్లిష్టమైన పునర్నిర్మాణ పద్ధతులను ఉపయోగించి గతంలో తొలగించాల్సిందేనని భావించిన అవయవాలను సైతం సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో విజయవంతంగా పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా అత్యాధునిక రోబోటిక్ అసిస్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ అందుబాటులోకి వచ్చిందని, ఈ టెక్నాలజీ ద్వారా మోకాలు తుంటి మార్పిడి శస్త్ర చికిత్సలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఎండోస్కోపిక్ స్పైనల్ సర్జరీ ద్వారా ఎన్నెముక సమస్యలు డిస్క్ జారడం వంటి సమస్యలకు కీహోల్ పద్ధతిలో చికిత్స అందించడం ద్వారా రోగి కొన్ని గంటల్లోనే నడవగలుగుతారని వృద్ధులకు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది అని తెలిపారు. కార్యక్రమంలో సోమాజిగూడ యశోద హాస్పిటల్ అసిస్టెంట్ మేనేజర్ రాంప్రకాష్, సీనియర్ మేనేజర్ పరమేష్ తదితరులు పాల్గొన్నారు
