రేకుర్తి హిందూ సమ్మేళనంలో అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శన.

ధర్మఘంట ఏప్రిల్ 19 కరీంనగర్ : నగరంలోని రేకుర్తి సాయి మహాలక్ష్మీ ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి నిర్వహించిన హిందూ సమ్మేళనంలో చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి.ప్రముఖ కూచిపూడి నృత్య శిక్షకురాలు వేల్పుల స్వప్న కుమారి వద్ద కూచిపూడి నృత్య సాధన చేస్తున్న చిన్నారులు సుహానీ, హియస్వి, శరణ్య,శృతి, దేవణ్షి, మయూఖ, స్పూర్తి, విణుగ్ఞ లు ప్రదర్శించిన నాట్య ప్రదర్శనలు హిందూ సమ్మేళనంలో పాల్గొన్న ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వాహకులు నృత్య శిక్షకురాలు వేల్పుల స్వప్న కుమారి, చిన్నారులను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *