యూనియన్ సభ్యత్వంలో సూర్యాపేట జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలి
దేశంలోనే అతిపెద్ద యూనియన్ టి యు డబ్ల్యూ జే ఐజేయు

ధర్మఘంట ఏప్రిల్ 28,సూర్యాపేట:
దేశంలోనే అతిపెద్ద యూనియన్ అయిన టియూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వం సేకరణలో సూర్యాపేట జిల్లాను రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో నిలపాలని టి యు డబ్ల్యూ జే (ఐజేయు) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు చలసాని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్కే టవర్స్ చలసాని శ్రీనివాసరావు కార్యాలయం వద్ద టి యు డబ్ల్యూ జే (ఐజేయు) సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణ బంటు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బత్తుల మల్లికార్జున్, రెబ్బ విజయకుమార్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన యూనియన్ సభ్యత్వ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి లాంఛనంగా సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించి మాట్లాడారు.
నిరంతరం జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేస్తూ, వారి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తున్న అతిపెద్ద యూనియన్ టియుడబ్ల్యు జె ఐజెయు అని వివరించారు. టియుడబ్ల్యూ ఐజెయు యూనియన్ కేవలం పత్రికా ప్రకటనలకు పరిమితం కాకుండా జర్నలిస్టుల పక్షం వహించి జర్నలిస్టుల పక్షపాతిగా, జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేస్తూ ప్రభుత్వానికి జర్నలిస్టులకు మధ్య వారధిగా ఉంటూ జర్నలిస్టులకు అండగా నిలుస్తున్న అసలైన యూనియన్ అని అన్నారు. ప్రెస్ అకాడమి చైర్మన్ గా యూనియన్ సలహాదారులు శ్రీనివాస్ రెడ్డిని మరొకసారి కొనసాగించడం పట్ల ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మన యూనియన్ కు ప్రాధాన్యత ఇస్తున్నారని, యూనియన్ నాయకుల నుండి సలహాలు సూచనలు తీసుకుంటున్నారని అన్నారు. జర్నలిస్టులకు ఇండ్లు, ఇంటి స్థలాల విషయంలో జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కూడ కలిసి మాట్లాడడం జరిగిందని అన్నారు. సూర్యాపేట జిల్లాలో యూనియన్ ను బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని ఆయన నాయకులకు సూచించారు. జిల్లా ఎన్నికలు త్వరలో నిర్వహిస్తామని చెప్పారు. ఈసారి జిల్లా అక్రిడిటేషన్ కమిటీలో టీయూడబ్ల్యూజే ఐజెయు కు చెందినవారు ఎక్కువగా ఉన్నారని వెల్లడించారు. అర్హతకలిగిన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూనే దరఖాస్తు చేసుకున్న వారికి అక్రిడిటేషన్లు లు వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా సోమవారం గుండెపోటుతో మరణించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పబ్లిక్ రిలేషన్ అధికారి మారబోయిన మధుసూదన్ మృతిపట్ల విలేకరులు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. పెద్ద ఎత్తున జర్నలిస్టు పాల్గొని యూనియన్ సభ్యత్వం తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణ బంటు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అద్యక్ష కార్యదర్శులు బత్తుల మల్లికార్జున్, రెబ్బ విజయ్, సుంకర బోయిన వెంకటయ్య, తల్లాడ చందన్, వల్లపట్ల రవి, ఏబీఎన్ మల్లేష్, దేవరశెట్టి వేణుమాధవ్, గుడిపూడి రామకృష్ణ, కొండ్లె కృష్ణయ్య, ఉయ్యాల నర్సయ్య, బిగ్ టీవీ రామకృష్ణ, రషీద్, తండు వెంకటేష్, కంచర్ల సురేందర్, రణబోతు శ్రీనివాస్ రెడ్డి, మల్లారెడ్డి, సాక్షి వేణు, నాగరాజు, మర్రెడ్డి, జహీర్, అహ్మద్ పాషా, యోయో టివి శంకర్, రవి యాదవ్, మేడిగ శ్రీనివాస్, జనార్ధన్, సాయి, జనార్ధన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
