పానగల్: రైతులకు ఉచితంగా బయో ఫెర్టిలైజర్స్ పంపిణీ

పానగల్ మండలం అన్నారంలో సర్పంచ్ వహీద్ అధ్యక్షతన ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం జరిగింది. కృషి విజ్ఞాన కేంద్రం (మదనపురం), వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ భవాని, ఎన్‌ఎఫ్‌ఎల్ రాజు రైతులకు అవగాహన కల్పించారు. నేల ఆరోగ్య నిర్వహణ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై వివరించారు. ఈ సందర్భంగా రైతులకు ఉచితంగా బయో ఫెర్టిలైజర్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *