• కోట రెజోనెన్స్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించడం అభినందనీయం.

• చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.

ధర్మఘంట ఏప్రిల్ 16 కరీంనగర్ : కరీంనగర్ లోని కోట ఇన్స్టిట్యూట్ వారి రెజోనెన్స్ జూనియర్ కళాశాల కరీంనగర్ కు ఇంటర్ ఫలితాల ద్వారా రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చి పెట్టిందని ఇది కరీంనగర్ కు గర్వకారణమని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్ లోని రేకుర్తిలో గల కెపిఎస్ హైస్కూల్లో కోట రెజోనెన్స్ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు రాష్ట్రస్థాయి ఫస్ట్ మార్కులు వచ్చిన సందర్భంగా ఏర్పాటుచేసిన అభినందన సభకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్లో అనతి కాలంలోనే కార్పొరేట్ కళాశాలలను తలదన్నేలా గ్రామీణ ప్రాంతం నుండి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలనె ఉద్దేశంతో ఉత్తమ పౌరులుగా తయారు చేయాలనే సంకల్పంతో కోట విద్యాసంస్థలను స్థాపించిన చైర్మన్ డాక్టర్ డి.అంజిరెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. ప్రపంచంలో చదువును మించిన ఆయుధం లేదని కష్టపడి చదువుకున్న వారే ఉన్నత స్థానాలలో ఉన్నారని కోట విద్యాసంస్థలు భవిష్యత్తులో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మరో అతిథి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన అంజిరెడ్డి కరీంనగర్ కు రాష్ట్రస్థాయిలో కీర్తి తీసుకురావడం గర్వకారణమన్నారు. ఫలితాలు రావడానికి ఇంకా టైం పడతది అనుకున్నా ఒక యజ్ఞంలా కృషిచేసి తొందరలోనే ఫలితం వచ్చేలా కృషిచేసిన డాక్టర్ డి అంజిరెడ్డి ఇదే స్ఫూర్తితో రాష్ట్రస్థాయి పరంపర కొనసాగించాలన్నారు. కోట ఇన్స్టిట్యూట్ అనేది ఇప్పుడు కరీంనగర్లో బ్రాండ్ ఇమేజ్ గా మారిందన్నారు. రాబోయే రోజుల్లో నెంబర్ వన్ గా కరీంనగర్ను తీర్చిదిద్దాలనే దానికి కోట విద్యాసంస్థలు బాటలు వేశాయన్నారు. మరో అతిథి ట్రస్మ అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ కోట విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ డి.అంజిరెడ్డి యొక్క క్రమశిక్షణ అతనిని బ్రాండ్ ఇమేజ్కు దగ్గరగా తీసుకు వెళ్లిందన్నారు. కోట విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ డి.అంజిరెడ్డి మాట్లాడుతూ ఇక్కడి విద్యార్థులు ఎక్కడికో వెళ్లకుండా స్మార్ట్ క్లాస్ విద్యా విధానం ద్వారా స్థానికంగానే మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో కోట విద్యాసంస్థలను స్థాపించి తొలి ప్రయత్నం లోనే రాష్ట్రస్థాయి మార్కులు సాధించడం గర్వకారణంగా ఉందన్నారు.విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధ్యాపక బృందం ఇచ్చిన ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని సంచలనాలు నమోదు చేస్తామన్నారు. రాష్ట్రస్థాయిలో ఫస్ట్ మార్క్ సాధించిన ప్రథమ సంవత్సరం ఎంపీసీలో గాలి సౌమ్యశ్రీ 469, ద్వితీయ సంవత్సరం కే.సహన శ్రీ 995, ద్వితీయ సంవత్సరం బైపీసీలో జి.రోషిని 993, బైపిసి ప్రథమ సంవత్సరంలో పి.శరణ్య 438 లను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ట్రస్మా అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు లు పూల గుచ్చం అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కోట విద్యాసంస్థల ప్రిన్సిపాల్ అధ్యాపక బృందం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *