ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషిచేసిన ఘనత పిఆర్టియు సంఘానిదే
ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి వెల్లడి
– సమాజంలో ఉపాధ్యాయ వృత్తి అతి పవిత్రమైంది – ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

ధర్మఘంట ఏప్రిల్ 24,సూర్యాపేట :రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించిన ఘనత పిఆర్టియు సంఘానికి దక్కిందని శాసనమండలి సభ్యులు పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్లో జరిగిన పసునూరి వెంకట్రాం రెడ్డి ఉద్యోగ విరమణ సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగిస్తూ ఉపాధ్యాయులకు ఉద్యోగుల వయో పరిమితి పెంపు, మెరుగైన పిఆర్సి , పదోన్నతులు , బదిలీలు పీఆర్టీయూ సంఘం చేసిన కృషి మూలంగానే సాధ్యమైందన్నారు. పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉద్యోగుల తో పాటుగా అన్ని సౌకర్యాలు కల్పించిన ఘనత పీఆర్టీయూ సంఘానికే దక్కిందని తెలిపారు. రాబోయే కాలంలో మంచి పిఆర్సి ఇప్పించడంతోపాటుగా జులై మాసంలో బదిలీలు జరిపించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. హెల్త్ కార్డుల మంజూరు ప్రక్రియ కొలిక్కి వచ్చిందని నెల రోజుల్లోనే ఉపాధ్యాయులందరికీ నగదు రహిత హెల్త్ కార్డులు మంజూరు కానున్నాయని తెలిపారు. పెండింగ్ బిల్లుల విడుదల కోసం రెండు విడతల్లో మొత్తం క్లియర్ అయ్యేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో అన్ని వృత్తులలో కెల్లా ఉపాధ్యాయ వృత్తి అతి పవిత్రమైందన్నారు . ప్రభుత్వ విద్యారంగం బాగుపడాలంటే అది ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడంతో పాటుగా సమాజంలో మంచి మార్పునకు కృషి చేయాలని కోరారు. పిఆర్టియు సంఘానికి అదేవిధంగా ఉపాధ్యాయులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి తాను ముందు ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు జిల్లా అధ్యక్షులు తంగేళ్ల జితేందర్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పందిరి విష్ణుకుమార్, మద్దిరాల మండల ప్రధాన కార్యదర్శి బాణాల శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్ మాసపత్రిక సంపాదక వర్గ సభ్యులు పప్పుల వీరబాబు, క్రమశిక్షణ సంఘం కమిటీ మెంబర్ కందుకూరి శివశంకర్ , కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీమతి షరీఫ్ ఉన్నేసా బేగం , గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గోలి వెంకటకృష్ణారెడ్డి, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతరెడ్డి రామలింగారెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు మేడిపల్లి శ్రీనివాస్, అల్లాడి సత్యనారాయణ , రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప్పు కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి ఉప్పు నాగయ్య, ప్రధానోపాధ్యాయులు గంగరాజు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు దండగుల ఎల్లయ్య, గుగులోత్ తావీర్య, లక్ష్మణ్ రావు, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రమేష్, హరికిషన్, వెంకట్ రెడ్డి, చంద్రారెడ్డి, గవాస్కర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, రాములు, మండల బాధ్యులు వంశీ, రాజేందర్ రెడ్డి, సత్యనారాయణ, విజయ్, సరిత, నవీన్, శ్రీనివాస్ జిల్లాలోని మండలాల అధ్యక్షులు శంకర్ ప్రసాద్, బషీర్, వినోద్, వాసుదేవరెడ్డి, సైదులు, చంద్రశేఖర్, చక్రధర్, ప్రధాన కార్యదర్శులు రవీందర్, పురుషోత్తం, శ్రీనివాస్, చౌదర్ రెడ్డి, కిరణ్ , జగన్, పిఆర్టియు రాష్ట్ర, జిల్లా, మండల కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
