ద‌ళిత క్రైస్త‌వుల‌కు ఎస్సీ హోదా ర‌ద్దుపై రౌండ్ టేబుల్ స‌మావేశం

ధర్మఘంట, ఏప్రిల్ 09, హైదరాబాద్ : ద‌ళిత క్రైస్త‌వులు ఎస్సీ హోదా ఎస్సీ రిజ‌ర్వేష‌న్లు మీద సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును నిర‌సిస్తూ క్రైస్త‌వ సేవా స‌మితి ఆధ్వ‌ర్యంలో వైఎంసీఏ ప్రాంగ‌ణంలో నేడు సికింద్రాబాద్ వైఎంసీఏ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వ‌హించచారు. ఈ రౌండ్ టేబుల్ స‌మావేశంలో తెలంగాణ జ‌న సమితి అధ్య‌క్షులు ఫ్రొఫెస‌ర్ కోదండ‌రాం, ఏపీ మాజీ మంత్రి రావెల్ల కిషోర్ బాబు, బీఆర్ఎస్ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీ సోమ భ‌ర‌త్ కుమార్, రిప‌బ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గాలి వినోద్ కుమార్ సీనియర్ హై కోర్టు అడ్వ‌కేట్ క‌దిరె క్రిష్ణ, తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మ‌న్ మేడే రాజీవ్ సాగ‌ర్ తదితరులు పాల్గొని మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా ప్రొఫెస‌ర్ కొదండ రాం మాట్లాడుతూ వివ‌క్ష అనేది ఎక్క‌డైనా ఉందని, అన్ని మ‌తాల్లో కూడా ఉందని, కావాల‌నే కేంద్ర ప్ర‌భుత్వం ద‌ళిత క్రైస్తవుల‌కు ఎస్సీ హోదా లేకుండా కుట్ర‌లు చేస్తుంద‌ని వివ‌రించారు. ఎస్సీలు క్రైస్త‌వంలోకి మారిన వారిపై అణ‌చివేత కొన‌సాగుతుంద‌ని తెలిపారు.

రావెల్ల కిషోర్ బాబు మాట్లాడుతూ మ‌నం ప్ర‌జాస్వామ్యంలో భాగమైననూ, రాజ్యాంగానికి బ‌ద్దులుగా ఉన్నాస‌రే .. కేంద్ర ప్ర‌భుత్వం ద‌ళిత క్రైస్త‌వ స‌మాజాన్ని అణ‌గ‌దొక్కే ప్ర‌య‌త్నం చేస్తున్నారని వివ‌రించారు. అంబేద్క‌ర్ ఇచ్చిన హ‌క్కులు ద‌ళిత క్రైస్త‌వుల‌కు ద‌క్క‌కుండా చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

రిప‌బ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ ద‌ళిత క్రైస్త‌వులు ఎక్క‌డ ఉన్నా… అంటరానిత‌నం, అణ‌చివేత‌కు ఇంకా గుర‌వుతున్నార‌ని తెలిపారు. ఇప్ప‌టికి చాలా మంది వారు ద‌ళిత క్రైస్త‌వులమ‌ని చెప్పుకోలేని ప‌రిస్థితి ఉంద‌న్నారు. వెంట‌నే ఇలాంటి వాటిని మ‌నం వ్య‌తిరేకించాల‌న్నారు.

ఆ రౌండ్ టేబుల్ స‌మావేశంలో క్రైస్త‌వ సేవా స‌మితి ప్రెసిడెంట్ ఎం స‌ల్మాన్ రాజు, శంక‌ర్ లూక్, లియో లూయిస్, ఎన్పీ రాజు, మోజెస్, సీనియ‌ర్ పాస్ట‌ర్ జాన్స‌న్ డేవిడ్, పాస్ట‌ర్ న‌వీన్ చిట్ట‌, జ‌వ‌హ‌ర్ కెన‌డి, సుధీర్, నార‌ప‌ల్లి రాజేష్చ, రిటైర్డ్ జ‌డ్జి జ‌య‌సూర్య‌, మేజ‌ర్ విజ‌య్ కుమార్, రిటైర్డ్ జ‌డ్జి రాజ్ కుమార్, కెప్టెన్ సునీల్, నాయుడు, బెంజ‌మిన్ వివిధ సంఘాల నాయకులు, పాస్టర్లు బిషప్ లు, కుల సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *