తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఈఏ) రాష్ట్ర సమావేశంలో ఘనంగా పూలే జయంతి వేడుకలు

సిపీఎస్ ను తక్షణమే రద్దు చేసి, ఓపీఎస్ ను పునరుద్ధరించాలి

తక్షణమే పిఆర్సీ ని ప్రకటించాలి

జి.ఓ. 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులకు వెంటనే న్యాయం చేయాలి

పెండింగ్‌లో ఉన్న డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు ఇతర బకాయిలను వెంటనే విడుదల చేయాలి

హెల్త్ కార్డుల ద్వారా నగదు రహిత వైద్య చికిత్సలు చేయాలి

గత 25 సంవత్సరాలుగా నిరంతర పోరాటాలు

టీఈఏ రాష్ట్ర అధ్యక్షురాలు డా. జి. నిర్మల

ధర్మఘంట, ఏప్రిల్ 11, హైదరాబాద్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపీఎస్) ను తక్షణమే రద్దు చేసి పాత పెన్షన్ పథకం (ఓపీఎస్) ను పునరుద్ధరించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తక్షణమే కొత్త వేతన సవరణ కమిషన్ (పిఆర్సీ) ని ప్రకటించాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఈఏ) రాష్ట్ర అధ్యక్షురాలు డా. జి. నిర్మల ప్రభుత్వాన్ని కోరారు. నేడు హైదరాబాద్ బషీర్‌బాగ్ లోని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీఈఏ) కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాదారు. ఈ సందర్భంగా సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించి పలు కీలక తీర్మానాలు చేశారు. ప్రధాన అంశాలుగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపీఎస్) ను తక్షణమే రద్దు చేసి పాత పెన్షన్ పథకం (ఓపీఎస్) ను పునరుద్ధరించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తక్షణమే కొత్త వేతన సవరణ కమిషన్ (పిఆర్సీ) ని ప్రకటించాలని, జి.ఓ. 317: జి.ఓ. 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులకు వెంటనే న్యాయం చేయాలని, పెండింగ్‌లో ఉన్న డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు ఇతర బకాయిలను వెంటనే విడుదల చేయాలని, హెల్త్ కార్డుల వినియోగంలో నగదు రహిత వైద్య చికిత్స అందేలా హెల్త్ కార్డులను సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత 25 సంవత్సరాలుగా ఉద్యోగుల సంక్షేమం కోసం తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీఈఏ) నిరంతరం పోరాటం చేస్తోందని, రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఆమె పేర్కొన్నారు.

ఈ సమావేశంలో కేంద్ర సంఘం చైర్మన్ చిలగాని సంపత్ కుమార స్వామి, వైస్ చైర్మన్ గడ్డం బాలస్వామి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎం.కె. రాజు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కె. మల్లేశ్, అధ్యక్షురాలు ఏ.జె. సుగంధిని, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పి. రామరాజు, ప్రచార కార్యదర్శి దాసరి వెంకటేశ్వర్లు, డాక్టర్ ఫోరం చైర్మన్ డా. జి. ప్రవీణ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ రాజశ్రీ, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు వీరయ్య, పంచాయతీ సెక్రటరీస్ ఫోరం చైర్మన్ చిలుక కరుణాకర్, టీచర్స్ ఫోరం చైర్మన్ పులిజ్వాల సందీప్ కుమార్, పంచాయతీ రాజ్ సెక్రటరీస్ ఫోరం సభ్యులు నాగేశ్, నర్సింహులు తదితరులు పాల్గొని మాట్లాడారు. వారి ప్రసంగాలు ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *