జల సంరక్షణపై విద్యార్థుల చైతన్య ర్యాలీ

ధర్మఘంట అక్టోబర్ 01,తాడూరు: నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం మేదిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘జల సంరక్షణ–భవిష్యత్తు రక్షణ’పై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నీటి వృథాను అరికట్టడం, వర్షపు నీటిని ఒడిసిపట్టడం, భూగర్భ జలాలను పెంచడం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ‘నీరు ఉంటేనే భవిష్యత్తు’ అంటూ విద్యార్థులు గ్రామంలో చైతన్య ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు త్యాగరాజుగౌడ్, ఉపాధ్యాయులు, జిల్లా సమన్వయకర్త మద్దిలేటి, విద్యార్థులు పాల్గొన్నారు.
