అమ్మలాంటి వృక్షాన్ని కాపాడుకుందాం
పురాతన మర్రి చెట్టుకు శాలువాతో సన్మానం..

కడ్తాల్ : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాసుపల్లి గ్రామంలోని ది ఎర్త్ సెంటర్లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న రెండ్రోజుల ‘యంగ్ ఎర్త్ లీడర్స్’ శిక్షణా కార్యక్రమంలో భాగంగా గురువారం వినూత్న కార్యక్రమం నిర్వహించారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలిచిన ఎన్నో ఏళ్ల నాటి మర్రి చెట్టుకు శాలువా కప్పి, పూజలు నిర్వహించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ అధ్యక్షురాలు లీలా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చెట్టు మనకు అమ్మలాంటిది.ప్రాణవాయువు, నీడ, ఆహారం, జీవవైవిధ్యాన్ని అందించే ప్రతి వృక్షాన్ని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని పరిరక్షించాలనిపిలుపునిచ్చారు. పాఠశాలల నుంచే విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందిస్తేనే భవిష్యత్ తరాలకు సుస్థిరమైన ప్రకృతిని అందించగలమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల ఉపాధ్యాయులు, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
