వనపర్తి జిల్లాలో 343 పోలియో కేంద్రాలు: ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

వనపర్తి జిల్లాలో 46,150 మంది ఐదేళ్ల లోపు చిన్నారులకు ఆదివారం పోలియో చుక్కలు వేయడానికి 343 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. కోసం దాదాపు 1,300 మంది వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. తల్లిదండ్రులందరూ తమ చిన్నారులకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువత సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
