బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు నింపే విధానాన్ని వివరించాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ, ఫారాలు నింపే విధానాన్ని వివరించాలని జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్ సురభి ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి శనివారం కలెక్టర్ ఛాంబర్‌లో సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌వో) లావణ్య ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా ఎన్యూమరేషన్ ఫారాన్ని స్వీకరించి, పరిశీలించారు. ఓటర్లు ఫారాన్ని పూర్తిగా, స్పష్టంగా నింపే విధంగా వారికి తెలియజేయాలనీ సూచించారు. ప్రతి ఓటరు అవసరమైన వివరాలను సక్రమంగా నమోదు చేసి, అవసరమైన పత్రాలను జతచేసి నిర్ణీత గడువులోగా సమర్పించేలా చూడాలని తెలిపారు. బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ, ఫారాలు నింపే విధానాన్ని వివరించాలని ఆదేశించారు. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా అర్హులైన ప్రతి ఓటరికి ఫారం అందేలా చర్యలు తీసుకోవాలని, ఈ ప్రక్రియను పారదర్శకంగా, సమయపాలనతో పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆర్డివో సుబ్రహ్మణ్యం, సీ సెక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *