అత్యాధునిక సాంకేతికతతో కూడిన విద్య ఆదిత్య స్కూల్ ప్రత్యేకత
నీవ్ పాత్ యాప్ తో పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ

సూర్యాపేట:నేటి తరం విద్యార్థులకు అణుగుణంగా అర్థవంతమైన విజ్ఞానం, అత్యాధునిక సాంకేతికతతో కూడిన విద్య ఆదిత్య స్కూల్ విత్ ఏఐ టెక్నాలజీ అందిస్తుందని ఆ పాఠశాల డైరెక్టర్ చింతమళ్ల రమేష్ అన్నారు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే చిన్నతనం నుంచే సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పాఠశాలలో సిసి కెమెరాలు, ఎంపరింగ్ యంగ్ మైండ్స్ విత్ ఏఐ, నీవ్ పాత్ యాప్ తో పిల్లలకు విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. పట్టణంలోని కృష్ణానగర్ కాలనీ నందు బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన పాఠశాలను చైర్మన్ చింతమళ్ల సుజాతనిర్మల్ కుమార్లతో కలిసి ప్రారంభించారు. తల్లిదండ్రులు పిల్లల ఉజ్వల భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకుని పాఠశాల ను ఎంపిక చేసుకోవాలని కోరారు. పిల్లలకు నర్సరీ నుంచి ఏడో తరగతి వరకు అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. చిన్నారులకు ప్లే గ్రూప్,డేకేర్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కట్కోజు విద్యా భారతి, కరస్పాండెంట్ కట్కోజు భరత్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

