దోబీల ఆత్మగౌరవని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న అధికారులు
ధోబి కులస్తులకే ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ ఇవ్వాలి
విధుల్లో నుంచి తొలగించిన జానకిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

ధర్మఘంట మే 09,సూర్యాపేట:
ధోబి కులస్తుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా అధికారులు వ్యవహరిస్తున్నారని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు కొత్త కొండ శ్రీలక్ష్మి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఇందిరాపార్క్ వద్ద ఇటీవల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విధుల్లో నుంచి తొలగించిన అక్కినపల్లి జానకితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గత 23 సంవత్సరాలుగా దోబీగా పనిచేస్తున్న అక్కనపల్లి జానకిని సరైన కారణం లేకుండానే ఆస్పత్రి సూపర్డెంట్,ఆర్ ఎం, సదరు కాంట్రాక్టర్ కుమ్మక్కై విధుల్లో నుంచి తొలగించడం దారుణం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యంగా ఆసుపత్రులలో విద్యాసంస్థలలో గురుకులాల్లో దోబీకులస్తులకే ఏజెన్సీ లేదా కాంట్రాక్ట్ ఇవ్వకపోవడం వల్ల దోబీ వృ త్తినే ఆధారంగా చేసుకుని బతుకుతున్న మేమంతా కూలీలుగా మారుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దోబిలకే కాంట్రాక్టు ఏజెన్సీ అప్పగించాలన్నారు. తనను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ జానకి అధికారులను ఆశ్రయించగా వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో దోబి కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి తనకు అధికారులు అందరూ తెలుసని అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గత 23 సంవత్సరాలుగా సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న అక్కెనపల్లి జానకిని విధుల్లోకి తీసుకోవాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సట్టు నాగయ్య, రాచకొండ గీత, మర్రిపల్లి స్వప్న,రాచకొండ శివకుమార్, మర్రిపల్లి మంగమ్మ,ఐతరాజు శ్రావణి, మర్రిపల్లి మాల్సూర్ పాల్గొన్నారు
