ఆర్టీసీని ప్రభుత్వంలో సంపూర్ణ విలీనం చేయాలి
తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి

సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిసి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ప్రభుత్వంలో సంపూర్ణంగా విలీనం చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి అన్నారు.జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్లో బుధవారం ఆ యూనియన్ ఆత్మీయ సమ్మేళనం సమావేశం టిఎంయు రాష్ట్ర కార్యదర్శి సుంకరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జూన్ 2 వరకు ఒప్పుకున్న తమ డిమాండ్లను పరిష్కరించాలన్నారు. మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేయాలని, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. ఆర్టీసి కార్మికుల కుటుంబాలలో వెలుగు నింపాలన్నారు. అంతకు ముందు మృతిచెందిన ఆర్టీసి ఉద్యోగులు, కార్మికులకు ప్రగాఢంగా నివాళులు అర్పించారు. టీఎంయూ సూర్యాపేట డిపో నూతన కమిటీ ఎన్నికైంది. డిపో చైర్మన్ గా గని, ట్రెజరర్ బాలు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్, సెక్రటరీ భాస్కర్, అడిషనల్ సెక్రటరీ సావిత్రి, ఈ సమావేశంలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం, శంకర్, రాష్ట్ర కార్యదర్శి సుంకరి శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా కార్యదర్శి గొపనబోయిన శ్రీనివాస్, గని, భాను, రవి, రమేష్, వెంకటేశ్వర్లు, సావిత్రి, భాస్కర్, సునిత, రేణుక తదితరులు పాల్గొన్నారు.
