పదవ తరగతి ఫలితాలలో శ్రీ చైతన్య పాఠశాల విద్యారణ్యపురి బ్రాంచ్ విద్యార్థుల విజయ దుందుభి.

ధర్మఘంట ఏప్రిల్ 30 కరీంనగర్ : పదవ తరగతి -2026 పరీక్ష ఫలితాల్లో శ్రీ చైతన్య పాఠశాల విద్యారణ్యపురి బ్రాంచ్‌ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల నిబద్ధత మరియు తల్లిదండ్రుల సహకారం కలిసి ఈ విజయాన్ని సాధించాయి. ఈ విద్యాసంవత్సరంలో క్యాంపస్ టాప్ మార్క్ 582 నమోదు కాగా, క్యాంపస్ సగటు 528 గా నిలిచింది. అన్ని విషయాల్లో విద్యార్థులు సమానంగా మంచి ప్రదర్శన కనబరిచారు మరియు మొత్తం ఫలితాలు పాఠశాల విద్యా ప్రమాణాలను ప్రతిబింబిస్తున్నాయి. ఈ ఫలితాల్లో ద్యుతి క్షేత్ర 582 మార్కులతో క్యాంపస్ టాపర్‌గా నిలిచింది. జష్నవి మరియు శ్రీ విశిష్ట 574 మార్కులు సాధించగా, శ్రీకర్ 573 మరియు నాగ దివ్య 571 మార్కులతో ప్రతిభ కనబరిచారు. 33 మంది విద్యార్థులలో 26 మంది విద్యార్థులు 500 ప్లస్ మార్క్స్ సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచి సంస్థకు గౌరవాన్ని తీసుకొచ్చారు రు.ఈ విజయానికి మార్గదర్శకత్వం అందించిన ఏ.జి.యం. శ్రీ రాజు, జోనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ మా విద్యార్థులను మరియు సిబ్బందిని అభినందిస్తూ, భవిష్యత్తులో ఇంకా ఉన్నత ఫలితాలు సాధించాలని ప్రోత్సహించారు. పాఠశాల ప్రిన్సిపల్ ఎ.సుమన్ మాట్లాడుతు విద్యార్థుల కృషిని, ఉపాధ్యాయుల అంకితభావాన్ని ప్రశంసిస్తూ, ఈ ఫలితాలు సమష్టి కృషి ఫలితమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ విజయానికి తమ వంతు సహకారం అందించిన , డీన్ శ్రీధర్,10వ తరగతి ఇన్‌చార్జ్ మున్నుస్వామి, ఫలితాల్లో భాగస్వాములైన అందరు ఉపాధ్యాయులు అభినందనలకు పాత్రులు. వారి సమిష్టి కృషి, పర్యవేక్షణ మరియు మార్గదర్శకంతోనే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయి. మొత్తంగా, ఈ ఫలితాలు విద్యారణ్యపురి బ్రాంచ్ యొక్క నాణ్యమైన విద్యను ప్రతిబింబిస్తూ, భవిష్యత్తులో ఇంకా గొప్ప విజయాలకు నాంధీ పలుకుతుంధని ఉపాధ్యాయ బృందం ఉద్ఘటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *