వినతులు ప్రజల వంతు…పరిష్కారం నా వంతు
బాధితులకు బాసటగా నిలిచిన ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి
ప్రజా దర్బార్ వినతులపై ప్రజల్లోకి సర్వోత్తమన్న*

సూర్యాపేట : సమస్యలపై వినతులు అందజేయడం ప్రజల వంతు వాటి పరిష్కారం నా వంతు అంటూ ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ప్రజాదర్బార్లో ప్రజలనుంచి వచ్చిన వినతులపై స్పందించారు. ప్రజా సమస్యలను ప్రజల మధ్యే పరిష్కరించేందుకు ప్రజల్లోకి వెళ్లారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 29వ వార్డు తాళ్లగడ్డ ప్రాంతంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల వెనుక భాగంలో ఉన్న వివాదాస్పద భూమిని ప్రజల విన్నపం మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత, మున్సిపల్ అధికారులతో కలిసి సర్వోత్తమన్న పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్న ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకొని తగిన విచారణ చేసి చర్యలు చేపట్టేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ప్రజల విన్నపాన్ని మన్నించి తమ సమస్యను పరిష్కరించేందుకు భూమి వద్దకు వచ్చిన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి బాధితులు ధన్యవాదాలు తెలిపారు.
