ఒంటెద్దు నరసింహారెడ్డి నోరుని అదుపులో పెట్టుకోవాలి
సీఎం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి
ఏఐసిసి సభ్యులు రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

ధర్మఘంట ఏప్రిల్ 27,సూర్యాపేట :సూర్యాపేట: బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, హైదరాబాదులో పిల్లుట్ల రఘు బిఆర్ ఎస్ పార్టీ లో చేరిక సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ల పై చేసిన అనుచిత విమర్శలను వెనక్కు తీసుకొని తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఏఐసీసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చకిలంరాజేశ్వర రావు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి లక్షాది తో కలిసి ఆయన మాట్లాడుతూ అనంతారం గ్రామం నుండి హుజూర్నగర్ కు వలసపోయిన ఒంటెద్దు నర్సింహారెడ్డి అవినీతి పరుడు, ఒక కేడర్ లేని నాయకుడు అని, గతంలో 10 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో కాంట్రాక్టుల పేరుతో పెద్దఎత్తున అవినీతికి పాల్పడిన వ్యక్తి అని విమర్శించారు. అటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారీ నీటిపారుదల, పౌరసరపరాల శాఖ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై చేసిన విమర్శలు అర్థరహితమని స్థాయికి మించి విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకుల పై స్థాయికి మించి విమర్శలు చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఒంటెద్దు నర్సింహరెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని, కోర్టు ద్వారా నోటీసులు పంపిస్తామని చెప్పారు. ఉత్తంకుమార్ రెడ్డి హుజూర్నగర్ , కోదాడ నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారని, హుజూర్ నగర్ లో 2160 సింగిల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తున్నారని , సూర్యాపేట జిల్లాలో మూడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేస్తున్నారని , అనేక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల నిర్మాణం చేస్తున్నారని, అటువంటి వ్యక్తిపై అవినీతి పడడంటూ విమర్శలు చేయడం సబబు కాదని అన్నారు. ఇటీవల జరిగిన అనంతారం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో 12 వార్డు లకు గాను తొమ్మిది వార్డులు కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగించిందని, 470 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరి కుంట్ల వేణుగోపాల్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్, పెన్ పహాడ్ హాడ్ మండల పార్టీ అధ్యక్షుడు తూముల సురేష్ రావు, సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, చివ్వెంల మండల పార్టీ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ధరావత్ వీరన్న, అనంతారం గ్రామ సర్పంచ్ మామిడి శోభ శ్రీనివాస్ శ్రీనివాస్, పలువురు కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు
