ప్రకృతి ప్రేమికుడు దుచ్చెర్ల సత్యనారాయణ పై దాడి అమానుషం
వ్యక్తి పై కాదు పర్యావరణం పై దాడి
– యానాల వెంకట్ రెడ్డి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ రాష్ట్ర కో. ఆర్డినేటర్
ధర్మఘంట ఏప్రిల్ 24,సూర్యాపేట : ప్రకృతి ప్రేమికుడు జల సాధన సమితి జాతీయ అధ్యక్షులు దుచ్చెర్ల సత్యనారాయణ పై దాడి అమానుషం అని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ యానాల వెంకట్ రెడ్డి అన్నారు. ప్రస్తుత కాలంలో ప్రకృతి పై అనేక దాడులు చేస్తూ అడవులను ధ్వంసం చేస్తూ మనకు మనమే పర్యావరణాన్ని నాశనం చేసుకుంటున్నాము. ఇప్పుడున్న జనరేషన్ కు విరుద్ధంగా ప్రకృతి ని కాపాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా తన 70 ఎకరాల సొంత భూమిలో అడవిని ఏర్పాటు చేసుకుని ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన పర్యావరణ ప్రేమికుడు జలసాధన సమితి జాతీయ అధ్యక్షులు దుచ్చర్ల సత్యనారాయణ పై దాడి చేయడం ముమ్మాటికీ ప్రకృతి మీద దాడి అని అన్నారు. అధికారుల వెంటనే స్పందించి గొర్ల కాపురలపై తగిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
