ఈనెల 26న జరిగే హైదరాబాదులో జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
టిఆర్పీ జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య,పట్టణ అధ్యక్షులు కుంభం నాగరాజు

ధర్మఘంట ఏప్రిల్ 24,సూర్యాపేట: హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ను అమలు చేయాలని కోరుతూ ఈనెల 26న జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టిఆర్పి జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య, పట్టణ అధ్యక్షులు కుంభం నాగరాజు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని టీఆర్పీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రైటు ఎడ్యుకేషన్ యాక్ట్ ని 2009లోనే అమలు చేశారని కానీ ఇంతవరకు అమలు చేయడంలో పాలకులు వైఫల్యం చెందారని అన్నారు. బహుజన కులాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నాణ్యమైన విద్య కల్పించాలని ప్రభుత్వ పాఠశాలలో ఇచ్చలవిడిగా ఫీజులు తీసుకుంటున్నారని ప్రభుత్వం చొరవ చూపి ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఉన్నత వర్గాలకు ఉన్నత విద్య అన్నట్లు, పేద మధ్యతరగతి వర్గాలకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారిందని అన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో పేద విద్యార్థులకు 25% కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో టిఆర్పీ పార్టీ ఏర్పడి అనతి కాలంలోనే ప్రజా సమస్యల పరిష్కరించడంలో ఎంతో కృషి చేసిందని తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఎమ్మెల్సీ టీఆర్పీ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో, టిఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ అధ్యక్షతన జరిగే ధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు, బహుజన వాదులు, టిఆర్పీ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.కార్యక్రమంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కొన్నె మంజుల గౌడ్, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు కవిత, ఆత్మకూర్ ఎస్ మండల అధ్యక్షుడు బొల్లె సైదులు, మైనార్టీ విభాగం నాయకులు చాంద్ పాషా, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సూపర్ సైదులు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కోల కరుణాకర్, నేలచెర్ల మధు ప్రజాపతి, రఘుమోహన్, ఆరాల రమేష్, లింగాల సైదులు, చాంప్లా, శ్రీదేవి, దీపమాల, తదితరులు పాల్గొన్నారు
