మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేతుల మీదుగా లచ్చిమల్ల వెంకన్న కు దళిత రత్న అవార్డు ప్రధానం

సూర్యాపేట : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో మంగళవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం చీదళ్ల గ్రామానికి చెందిన లచ్చిమల్ల వెంకన్నకు దళిత రత్న అవార్డును తెలంగాణ ప్రభుత్వం నుండి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేతులమీదు గా అందుకున్నారు. లచ్చిమల్ల వెంకన్న విద్యార్థి దశ నుండి నాయకుడిగా అనేక ఉద్యమాలలో పాల్గొని విద్యార్థుల సమస్యలపై ముందుండి పోరాటం చేస్తూ మరోవైపు చదువులో చురుగ్గా పాల్గొంటూ పేదరికంలో ఉండి చదువుపై దృష్టి సారించి 21 సంవత్సరానికే ఉద్యోగం సాధించాడు. విద్యార్థి నాయకులు తెలంగాణ ఉద్యమకారులు, సామాజిక ఉద్యమకారులు, మరియు నిత్యం దళిత పేదల కోసం పరితపించి అనేక సేవ కార్యక్రమాలలో ముందుండేవారు.తెలంగాణ ఉద్యమం మొదలు 2001 మొదలుకొని 2014 వరకు,తెలంగాణ సాధన కొరకు జేఏసీతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొని 2011లో టి యు టి ఎఫ్ ఏర్పాటులో కీలక భూమిక వహించి ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా, యాదాద్రి జిల్లా అధ్యక్షులుగా, నేడు రాష్ట్ర ప్రధాని కార్యదర్శి గా పదవులు చేపట్టారు. ఒకవైపు ఉద్యోగ వృత్తి తో పాటు మరోవైపు ఉద్యోగుల సమస్యలపై పోరాడుతూ అంబేద్కర్ భావజాలంతో దళిత ఉద్యమానికి దళితుల అభ్యున్నతి కొరకు హైదరాబాద్ కేంద్రంగా ఉద్యమం చేస్తున్నారు.అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని దళిత పేద బడుగు బలహీన వర్గాల కోసం తన శాయశక్తుల పాటుపడుతున్న లచ్చిమల్ల వెంకన్న మునుముందు దళిత,పేద,బడుగు బలహీన వర్గాలను మమేకం చేయడంలో ఇంకా ముందుకు వెళ్లాలని బంధుమిత్రులు ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లచ్చి మల్ల వెంకన్న మాట్లాడుతూ దళిత రత్న అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని అలాగే నాకు ఈ అవార్డు రావడం వలన బాధ్యతలు పెంచాయని అన్నారు.
