అమర్ నాథ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో అధునాతన నాణ్యమైన వైద్య సేవలు
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఎంజీ రోడ్ అమర్ నాథ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో అధునాతన నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని సూర్యాపేట పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. జిల్లా కేంద్రంలోని అమర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని గురువారం హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ అనంతుల అనుష తో కలిసి ఆమె సందర్శించారు. అనంతరం హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుదూర ప్రాంతాలను హైదరాబాద్, విజయవాడ, వెళ్లకుండా 100 పడకల ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. నిర్వాహకులు అనంతుల అనూష మాట్లాడుతూ తమ హాస్పటల్ సర్జన్, న్యూరాలజీ, గైనకాలజిస్ట్, అందుబాటులో ఉన్నాయని, పేద ప్రజల సౌకర్యార్థం ఉచిత వైద్య శిబిరాలు అవసరమైన ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత కొన్ని ఏళ్లుగా జిల్లా కేంద్రంలోని విద్యానగర్ శ్రీ రామలింగేశ్వర సహిత త్రిశక్తి, అయ్యప్ప ఆంజనేయ స్వామి దేవాలయంలో అనేక ధార్మికమైన సహాయ సహకారాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. దేవాలయానికి సహకరించే దాతలకు, భక్తులకు హాస్పిటల్లో రాయితీ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అమర్ నాథ్ సూపర్ స్పెషాలిటీ చైర్ పర్సన్ రేఖ జీవన్ గౌడ్, జితేందర్ రెడ్డి, డాక్టర్ జి, రాగిణి, డాక్టర్ అఖిల్, డాక్టర్ చంద్రశేఖర్, రెంటాల సతీష్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

