ఘనంగా ది స్పేస్ హైస్కూల్ పదవ వార్షికోత్సవ వేడుకలు
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రోబో స్ట్రోమ్

సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ రోడ్డులో గల ది స్పేస్ హైస్కూల్ 10వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు.ఈ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా విద్యార్థులచే ఏర్పాటు చేసిన రోబో స్ట్రోమ్
అల్టిమేట్ స్టూడెంట్ రోబో ఎక్స్ పో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ ప్రజ్ఞారెడ్డి మాట్లాడుతూ నేటి ఆధునిక సాంకేతిక యుగంలో విద్యార్థులు చదువుతోపాటు టెక్నికల్ అంశాలపై కూడా పట్టు సాధించాలన్నారు. విద్య ద్వారా ఉన్నత స్థాయికి చేరవచ్చని అన్నారు.విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.అనంతరం ది స్పేస్ హై స్కూల్ కరస్పాండెంట్ జె.వనిల్ కుమార్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు టెక్నికల్ స్కిల్స్ చాలా అవసరమని అన్నారు.తమ పాఠశాల విద్యార్థులకు టెక్నికల్ స్కిల్స్ ను అందించాలనే ఆలోచనలకు విద్యార్థుల ఉత్సాహం, తల్లిదండ్రుల ప్రోత్సాహం అభినందనీయమని అన్నారు.విద్యార్థులు తాము నేర్చుకున్న టెక్నికల్ అంశాలచే ఏర్పాటు చేసిన రోబో స్ట్రోమ్ కు మంచి ఆదరణ లభించిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీలతా దేవి, చైర్మన్ మురళీ మనోహర్ రెడ్డి, వివిధ పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

