ధర్మభిక్షం జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం…
సూర్యాపేట జిల్లాకు ధర్మ బిక్షం పేరు పెట్టాలి..
ధర్మభిక్షం కాంస్య విగ్రహాన్ని మినీ ట్యాంక్ బండ్ పై పెట్టాలి..
నికార్సైన కమ్యూనిస్టు యోధుడు ధర్మభిక్షంకు ఘనంగా నివాళులు.
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్..

సూర్యాపేట : తెలంగాణ సాయుధ పోరాట యోధులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, నికార్సైన కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం జీవితం నేటి తరానికి స్పూర్తిదాయకమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ అన్నారు. కామ్రేడ్ ధర్మభిక్షం 15వ వర్ధంతి సందర్భంగా గురువారం స్థానిక ధర్మభిక్షం చౌక్ లో ఆయన విగ్రహానికి పట్టణానికి చెందిన ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మభిక్షం జీవితం సమాజానికి ఎంతో ఆదర్శమైందన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నో అభివుద్ది కార్యక్రమాలు చేసి పేదల కళ్లల్లో వెలుగులు నింపారని గుర్తు చేశారు. ఆనాడు చదువుకునే పేద విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టళ్లను ఏర్పాటు చేశారని ఆ హాస్టళ్ళలో చదువుకున్న ఎంతోమంది నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారని అన్నారు. నికార్సైన కమ్యూనిస్టు నాయకుడిగా చట్ట సభలనే ఉద్యమ వేదికగా చేసుకొని అనేక సమస్యలకు పరిష్కారం చూపారన్నారు. ప్రజల కోసం పని చేసే నాయకులు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటారని అలాంటి నాయకుడే ధర్మభిక్షం అన్నారు. మహానుబావులను స్మరించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన చూపిన బాటలో యువత నడువాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లాకు ఆయన పేరును పెట్టాలని అలాగే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ పై ధర్మబిక్షం విగ్రహాన్ని పెట్టడంతో పాటు గతంలో చెప్పినట్లు సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ధర్మబిక్షం పేరు పెట్టాలని అదే మనం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫి ఉల్లా, మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి ఎం.డేవిడ కుమార్, పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, డేగల జనార్ధన్, దంతాల రాంబాబు, చామల అశోక్ కుమార్, రేగటి లింగయ్య, దోరేపల్లి శంకర్, చివ్వెంల మండల కార్యదర్శి ఖమ్మంపాటి రాము, బూర సైదులు, ఎడెల్లి శ్రీకాంత్, పెన్డ్రా కృష్ణ, దంతాల పద్మ రేఖ, దేశ గాని హేమలత, ఎల్ భద్రయ్య, బైరు వెంకన్న, బైరు శైలేందర్, టైసన్ శ్రీను , అయితే గాని కామేష్, తదితరులు పాల్గొన్నారు.
