
సూరత్ : గుజరాత్ లోని సూరత్ కు చెందిన ఓ వ్యక్తి ఏటీఎం నుంచి రూ.10 వేలు విత్ డ్రా చేయగా నగదు రాకపోయినా ఖాతా నుంచి డబ్బు కట్ అయింది. దీనిపై అతడు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులను సంప్రదించాడు. వారు స్పందించక పోవడంతో వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. 9 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత కోర్టు తీర్పు ఇచ్చింది. వడ్డీ, మానసిక వేదనకు పరిహారం, న్యాయ ఖర్చులతో కలిపి రూ.3.28 లక్షలు చెల్లించాలని బ్యాంకును ఆదేశించింది.
