గ్యాస్ ధరలు పెరిగితే… డీజిల్ స్టవ్‌తో సొల్యూషన్

గ్యాస్ ప్రత్యామ్నాయ మార్గం

వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడంతో హోటల్ యజమానులు ఇబ్బందులు పడుతున్న సమయంలో, సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన మహేశ్ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చాడు.

తాను డీజిల్‌తో పనిచేసే ప్రత్యేక స్టవ్‌ను తయారు చేసి ఖర్చును గణనీయంగా తగ్గించాడు. చిన్న విద్యుత్ మోటార్ సహాయంతో గాలిని ఒక పైపు ద్వారా, డీజిల్‌ను మరో పైపు ద్వారా పొయ్యి దగ్గరకు పంపి మంట వెలిగేలా ఈ స్టవ్‌ను రూపొందించాడు.

అవసరానికి అనుగుణంగా మంటను పెంచడం, తగ్గించడం కూడా వీలవుతుంది. ఒక లీటర్ డీజిల్‌తో గంట నుంచి రెండు గంటల వరకు వంట చేయవచ్చని మహేశ్ తెలిపాడు.

వాణిజ్య గ్యాస్ సిలిండర్‌తో పోలిస్తే ఖర్చు సగానికి తగ్గిందని చెప్పాడు. ఈ స్టవ్ తయారీకి సుమారు రూ.10 వేల ఖర్చుతో పాటు నాలుగు రోజుల శ్రమ పట్టింది.

ఈ ఐడియా చూసి మరికొన్ని హోటల్ యజమానులు కూడా ఇలాంటి స్టవ్‌లు తయారు చేయించుకోవడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *