తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఇంటిపై జరిగిన దాడిపై నిరసన

తీవ్రంగా ఖండించిన ఉస్మానియా యూనివర్సిటీ బహుజన విద్యార్థి సంఘాలు

దళిత ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య

ధర్మఘంట, మార్చి 18, హైదరాబాద్ : తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఇంటిపై జరిగిన దాడిని నేడు ఉస్మానియా యూనివర్సిటీ బహుజన విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఆదివాసీల అడవులు కాలిపోతున్నాయి, దళితులపై దాడులు జరుగుతున్నాయి, కొందరు మనువాద బ్రాహ్మణవాదులు మాట్లాడుతున్న మాటలు ప్రజలకు అర్థం కావడం లేదు, ఈ విషయాలపై ప్రశ్నించినందుకు సమాధానం ఇవ్వకుండా ఒక ప్రజాప్రతినిధి ఇంటిపై దాడి చేయడం, అందులో దళిత ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్యఅని, ఇది సరైన విధానం కాదని బహుజన సంఘాలు స్పష్టం చేశాయి.

మందుల సామేల్ దళిత మాదిగ వర్గానికి చెందిన వ్యక్తి, ప్రజల మద్దతుతో రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాబడిన ఒక దళిత ప్రజాప్రతినిధికి విలువ ఇవ్వకుండా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని, పెద్ద మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే మందుల సామేల్ అని, నిందితులు ఆయుధాలతో ఇంటి పైకి వచ్చి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని, ఉస్మానియా యూనివర్సిటీ బహుజన విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి.

బిజెపి ఆర్ఎస్ఎస్ మరియు వాటి అనుబంధ సంఘాలు మనువాద ముసుగులో కొత్త రూపం దాల్చి ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఇది దేశానికి ఏ మాత్రం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఈ దాడికి సంబంధించి బండి సంజయ్ మరియు బీజేపీ నాయకులు బాధ్యత వహించాలని, వెంటనే మందుల సామేల్ కి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు

ఈ సందర్భంగా డి.బి.ఎస్.ఏ రాష్ట్ర కోఆర్డినేటర్ జంగిలి దర్శన్ మాట్లాడుతూ, దేశంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు ఉందని, ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఈ ఘటనలో పాల్గొన్న అందరి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, దళిత శాసనసభ్యులందరికీ ప్రత్యేకమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ కి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.

ఓయూ నాయకుడు గడ్డం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి పౌరుడికి భావ స్వేచ్ఛ ఉందని, ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలని ప్రయత్నిస్తే మరింత బలంగా స్పందిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో మాదిగలు సంఘటితంగా ఉన్నారని తెలిపారు.

బి.ఎస్.ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ వేల్పుల సంజయ్ మాట్లాడుతూ, ఒక ఎమ్మెల్యేకు రక్షణ లేకపోతే సాధారణ ప్రజలకు పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు. బీఎస్పీ నాయకుడు డప్పు నర్సింగ్ రావు మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రణయ్, అరుణ్ కుమార్, శ్రీకాంత్, గణేష్, నరేష్, చరణ్, కళ్యాణ్ నాయక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *