ధర్మఘంట ఫిబ్రవరి 02 నల్గొండ(గంట సోమన్న స్టేట్ కోఆర్డినేటర్): నల్లగొండ రైల్వే స్టేషన్ పరిధిలో ఆదివారం ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి రైలు నుంచి కింద పడిపోయాడు.ఇది గమనించిన నల్గొండ రైల్వే స్టేషన్ సిబ్బంది 108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వడంతో సమాచారం అందుకున్న నల్గొండ టౌన్108 సిబ్బంది వెంకటేష్ మరియు కోటేష్ లు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని దాదాపు అర కిలో మీటర్ వరకు స్ర్టేచర్ మీద తోసుకొని అంబులెన్స్ ను చేరుకుని,ప్రథమ చికిత్స అందిస్తూ స్థానిక నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.
