

ధర్మఘంట, జనవరి 26, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 77వ, గణతంత్య్ర దినోత్సవ సందర్బంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే “ఉత్తమ సేవా పురస్కారం” కు ఎంపికైన తానికొండ వర ప్రసాద రావు కి వారి కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్క చెల్లెల్లు, బంధుమిత్రులు, సహఉద్యోగులు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఐఏఎస్. జిల్లా ఎస్ పి డా. వి. అజిత ఐపీస్ తదితరుల చేతులమీదుగా నేటి 77వ, గణతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే “ఉత్తమ సేవా పురస్కారాన్ని’ ప్రశంసాపత్రాన్ని తానికొండ వర ప్రసాద రావు అందుకున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆర్.ఐ.ఓ (ఇంటర్మీడియట్) గా విధులు నిర్వహిస్తూ అత్యంత నిజాయితీ, క్రమశిక్షణ, విధి నిబద్ధతతో ప్రజాసేవలో తనదైన ముద్ర వేసిన అరుదైన అధికారి వర ప్రసాద రావు. ప్రత్యేకించి పేద మరియు వెనుకబడిన విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి అత్యంత ప్రశంసనీయం. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా ప్రోత్సహించడం, సరైన మార్గనిర్దేశం చేయడం, ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి చేరేలా నిబద్ధతతో కృషి చేయడం, ఇవన్నీ ఆయన సేవాభావానికి స్పష్టమైన నిదర్శనాలు.
విధులను కేవలం ఉద్యోగంగా కాకుండా సామాజిక బాధ్యతగా భావిస్తూ, ప్రభుత్వం – ప్రజల మధ్య నమ్మకానికి ప్రతీకగా నిలిచిన ఆయన సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “ఉత్తమ సేవా పురస్కారం” ” ప్రశంసాపత్రంతో” సత్కరించడం గర్వకారణం.
ఈ సందర్భంగా పురస్కార గ్రహీత తానికొండ వర ప్రసాద రావు మాట్లాడుతూ మన రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, బాధ్యతలను గౌరవిస్తూ దేశ అభివృద్ధికి, గ్రామ అభ్యున్నతికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని, త్యాగధనులైన స్వాతంత్ర్య సమరయోధుల్ని స్మరించుకుంటూ దేశ ఐక్యత, సమానత్వం, సోదరభావాన్ని ఎల్లప్పుడూ కాపాడుదామని, పురస్కారం ఇచ్చి ప్రభుత్వం తన బాధ్యతలను రెట్టింపు చేసిందని, వారి సేవలలో భాగమై సహకరించిన ప్రతివ్యక్తికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన అన్నదమ్ములు టి. వెంకటేశ్వర రావు, టి. ఫిలిప్ భాస్కర్, టి. బాల సుబ్రహ్మణ్యం, టి. దామోదర రావు, టి. సంపత్ కుమార్, చెల్లెలు టి. శారదతో పాటు మిత్రులు, బంధువులు అందరూ ఈ గౌరవాన్ని పంచుకుంటూ వర ప్రసాద రావు సేవలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు.

డా. బీఆర్ అంబేద్కర్ సమానత్వం, సామాజిక న్యాయం, ఆత్మ గౌరవం అనే భావజాలాన్ని పునికి పుచ్చుకొని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ప్రత్యేకించి అణగారిన వర్గాల అభ్యున్నతికి తన సేవలను అంకితం చేస్తున్న వ్యక్తిత్వమే వర ప్రసాద రావు యొక్క ప్రత్యేకత.
ఇలాంటి మరెన్నో సేవా పురస్కారాలు అందుకుని, ఇంకెందరో పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ సేవలు స్ఫూర్తిదాయకం… మీ ప్రయాణం ఆదర్శనీయం. గణతంత్య్ర దినోత్సవ సందర్భంలో ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకోవడం మరింత గర్వకారణం.
