భీం డ్రమ్ ఆధ్వర్యంలో  ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద “ఎల్లుదామ ఎల్లుదామ జాతర”  సమ్మక్క సారక్క పాట 2026 ఫుల్ సాంగ్ విడుదల

ధర్మఘంట, జనవరి 24, హైదరాబాద్ : సమ్మక్క సారక్క జాతర యొక్క విశిష్టతను, ఆదివాసీ సంస్కృతి గౌరవాన్ని ప్రతిబింబించే “ఎల్లుదామ ఎల్లుదామ జాతర” సమ్మక్క సారక్క పాట 2026  ఫుల్ సాంగ్‌ను భీం డ్రమ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో శనివారం డి.బి.ఎస్.ఏ, భీం డ్రమ్  వ్యవస్థాపక అధ్యక్షుడు డా. నలిగంటి శరత్ చమార్ మరియు జబర్దస్త్ ఫేమ్ జీవన్ మరియు ఓయూ విద్యార్థి సంఘాల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు.

ఈ పాటను డి.బి.ఎస్.ఏ, భీం డ్రమ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. నలిగంటి శరత్ చమార్ గానం అందించారు. ఈ పాటకు చికోడు నర్సన్న సాహిత్యం అందించగా, సంగీతాన్ని ప్రశాంత్, కాస్టు జబర్దస్త్ ఫేమ్ జీవన్ సమకూర్చారు.

ఈ గీతానికి డి.ఓ.పి  కృష్ణ మెరుగు నిర్వహించగా, అసిస్టెంట్ డీ.ఓ.పీగా నవీన్, నిర్మాతగా ముప్పరపు ప్రకాష్, కో ఆర్డినేటర్‌గా కల్లెపల్లి సతీష్, పోస్టర్ డిజైన్‌ను వర్షిత్ బామర్ రూపొందించారు.

ఈ సందర్భంగా డి.బి.ఎస్.ఏ, వ్యవస్థాపక అధ్యక్షుడు డా. నలిగంటి శరత్ చమార్ మాట్లాడుతూ… సమ్మక్క సారక్క జాతరలోని పోరాట చరిత్ర, ఆదివాసీ స్వరం, సాంస్కృతిక విలువలను ఈ పాట ప్రభావవంతంగా ప్రతిబింబిస్తోందని, ఇలాంటి సాంస్కృతిక గీతాలు యువతకు తమ మూలాలను గుర్తు చేస్తాయని, ఆదివాసీ సంస్కృతి పరిరక్షణకు బలమవుతాయని వారు అభిప్రాయపడ్డారు.

జబర్దస్త్ ఫేమ్ జీవన్  మాట్లాడుతూ,ఇది కేవలం ఒక పాట కాదు, ఆదివాసీ జీవన శైలిని గుండెతో అనుభూతి చెందే ప్రయత్నమని అన్నారు. సమ్మక్క సారక్క జాతర అస్థితాన్ని  యువతకు చేరవేసే శక్తి ఈ పాటకు ఉందని, ఇలాంటి సృజనాత్మక ప్రయత్నాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఎల్లుదామ ఎల్లుదామ జాతర సమ్మక్క సారక్క పాట  2026 ఫుల్ సాంగ్ విడుదలై శ్రోతల నుంచి విశేష స్పందనను పొందుతోంది.

ఈ కార్యక్రమంలో డి.బి.ఎస్.ఏ స్టేట్ కో ఆర్డినేటర్ జంగిలి దర్శన్, టి.ఎస్.పి. జాక్ వ్యవస్థాపక అధ్యక్షుడు వలిగొండ నర్సింహా, బి.ఎస్.ఎప్.ఐ  నేషనల్ కో ఆర్డినేటర్ కరుణాకర్ బహుజన్, బి.ఎస్.యూ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి వీరన్న, అంసా ఓయూ అధ్యక్షుడు నామ సైదులు, ఏ.ఐ.ఎస్.ఆఫ్  ఓయూ అధ్యక్షుడు ఉదయ్, ఎస్.ఎస్.యూ రాష్ట్ర అధ్యక్షుడు నవీన్, ఎస్.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వేదాంథ్ మౌర్య, డి.బి.ఎస్.ఏ విద్యార్థి నాయకులు కాసర్ల సైదులు, రవీందర్, ప్రణయ్, శ్రీను కుషాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *