ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కలిగి ఉండాలి
ప్రధానోపాధ్యాయులు కృష్ణారావు

నేలకొండపల్లి : ప్రతి విద్యార్థి పర్యావరణం పై అవగాహన కలిగి ఉండాలని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. కృష్ణారావు అన్నారు. మంగళవారం మండలంలోని రాజేశ్వరపురం ఉన్నత పాఠశాలలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో జరిగిన పర్యావరణంపై అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరు విద్యార్థి దశనుండే పర్యావరణం పై అవగాహన కలిగి ఉండాలని,ప్రతి ఒక్కరూ ఇంటిలో మొక్కలు నాటాలని అన్నారు. సిజీ ఆర్ ద్వారా ఎన్నుకోబడ్డ ఎర్త్ లీడర్ల కు, యంగ్ ఎర్త్ లీడర్ల కు దుచర్ల సత్యనారాయణ వీడియో ద్వారా అడవులు ఎలా నిర్మించించాలి, పర్యావరణాన్ని ఎలా కాపాడాలి అనే అంశంపై అవగాహన కల్పించారు. మీరు కూడా ప్రతి ఒక్కరూ పుట్టినరోజు రోజు ఒక మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. వేసవిలో మన పాఠశాలలో నాటిన మొక్కలకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని నీళ్లు పోసి వాటిని ఈ వేసవి కాలం వరకు కాపాడాలి అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ జిల్లా కోఆర్డినేటర్ మామిడి శంకరయ్య, మెంటర్ టీచర్ రమాదేవి, సీనియర్ ఉపాధ్యాయులు ఆదిత్య, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
