డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌళిక సదుపాయాలు కల్పించాలి

నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

ధర్మఘంట మార్చి 26,సూర్యాపేట: పట్టణంలోని కేసారం వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌళిక సదుపాయాలను కల్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబందిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. గురువారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రెవెన్యూ, మున్సిపల్, హౌసింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రజల కోసం నిర్మించిన రెండు పడకల గదుల ఇళ్లలో మౌళిక సదుపాయలు అయిన త్రాగునీరు, విద్యుత్‌ మొదలైన సదుపాయాలను నెల రోజుల్లో పూర్తిచేయాలని సంబందిత కాంట్రాక్టర్ ఆదేశించారు. వాటర్ ట్యాంక్ లకు కనెక్షన్ల పనులు పూర్తి చేసి నీటిసరఫరా జరిగేలా చూడాలన్నారు.
కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిద్ధార్థ, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, గుత్తేదారులు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *