చేతి సంచితో ప్లాస్టిక్ నివారణ పై ఇంటింటి ప్రచారం

చెట్ల ను నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం

వార్డు కౌన్సిలర్ బైరబోయిన శ్రీదేవి శ్రీనివాస్

సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని 17వ వార్డు చింతలచెరువు లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటుదాం ప్లాస్టిక్ నివారిద్దాం పర్యావరణంను కాపాడదాం అనే అంశంపై చేతి సంచి తో ఇంటింటి ప్రచారం నిర్వహించి వీధి ప్రజలకు ప్లాస్టిక్ నివారణ పై, మొక్కల పెంపకం పై అవగాహన కల్పించి ఇంటింటికి స్టిక్కర్ అంటించారు. ఈ సందర్భంగా గ్రీన్ క్లబ్ ట్రస్ట్ అధ్యక్షుడు ముప్పారపు నరేందర్ వార్డు కౌన్సిలర్ బైరబోయిన శ్రీదేవి శ్రీనివాస్ లు మాట్లాడుతూ 17వ వార్డు చింతలచెరువు లో చేతి సంచితో ఇంటింటి ప్రచారం నిర్వహించి కాలుష్య నివారణ, ప్లాస్టిక్ వాడొద్దని చెప్పి,పర్యావరణం పై అవగాహన కల్పించి ప్లాస్టిక్ నివారించి చేతి సంచులను వాడి పర్యావరణాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తోటకిరణ్,అలేఖ్య, బొలిశెట్టి మధు, మిర్యాల వెంకటేశ్వర్లు, సోమ హేమమాలిని, మిట్టపల్లి సువర్ణ లక్ష్మి, యమా రజిని, తల్లాడ రామచంద్రయ్య, సోమ సురేష్, దేవరశెట్టి నాగరాజు, మంచాల శ్యామ్, అరుణ, సురేందర్, గుండా కిరణ్, వెంకట్,సంపత్, సతీష్ బాబు మామిడి శంకర్, బైరబోయిన సైదులు,పవన్, మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *