కుక్క కాటుతో మహిళకు గాయాలు

సూర్యాపేట లో కుక్కల బెడద అధికంగా ఉన్నది.ప్రతి రోజు ఉదయం వాకింగ్ వెళ్లేవారితో పాటు పాద చారులకు ఇబ్బంది తప్పడం లేదు.గతం లో ఎన్ని మార్లు మున్సిపల్ అధికారులకు తెలియ జేసిన శూన్యం అని ప్రజలు తెలుపుతున్నారు.గురువారం జయలక్ష్మి అనే మహిళ సూర్యాపేట ఉన్నత యోగ శిక్షణ కేంద్రం లో యోగా శిక్షణ కు వెళుతుండగా కుక్క కాటుకు గురయ్యారు.ఆరోగ్యం కొరకు వాకింగ్ కు వెళ్తున్న ప్రజలకు ఉన్న ఆరోగ్యం ఎమో కానీ కొత్తగా సమస్యలు ఎదురవుతున్నాయని ప్రజలు తెలుపుతున్నారు. మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ కొరకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు.మరి అక్కడికి వాకింగ్ వెళ్ళాలంటే బయపడే పరిస్థితి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు,నూతన మునిసిపల్ పాలక వర్గం దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.ముఖ్యంగా వేసవి లో అధిక వేడి కారణంగా కుక్కలు ఆందోళనకు గురై ప్రజల పై దాడి చేసే అవకాశం ఎక్కువ గా ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *