అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు

కడ్తాల్ : మండలంలోని అన్మాస్ పల్లి గ్రామంలో మూడు రోజుల పాటు కన్నులపండుగగా జరిగిన ఉత్సవాలు, పూజ కార్యక్రమాలు శుక్రవారం శ్రీ రామేశ్వర వీరాంజనేయ జ్ఞాన సరస్వతి మాత ఆలయంలో శ్రీరామ నవమి పర్వదినోత్సవం సందర్భంగా రాములవారి కల్యాణంతో ముగిసినవి. ఆలయ ధర్మకర్త కోర్పులు లీలా లక్ష్మారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా రాముల వారి కళ్యాణం జరిగింది. ఈ సందర్భంగా లీలా లక్ష్మారెడ్డి దంపతులు మాట్లాడుతూ శ్రీరాముని జీవితం మానవాళికి ఆదర్శప్రాయమని, నీతి,ధర్మబద్ధమైన జీవనానికి గొప్ప నిదర్శనమని అదే మార్గములో మనమంతా నడవాలని అన్నారు. అనంతరం సంవత్సర కాలం పాటు ఆలయంలో నిర్వహించబోయే పూజా కార్యక్రమాలకు సంబంధించిన వార్షిక పత్రాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో వందేమాతరం రవీందర్ రావు, మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్ , వేద పండితులు బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శర్మ బృందం మరియు గ్రామ సర్పంచ్ శ్రీను, ఉపసర్పంచ్ మహేష్, వార్డు సభ్యులు రావుల పద్మ రాజు గౌడ్, జగన్ గౌడ్, ప్రశాంత్, మోతిలాల్, రేణుక శివ, దేవుల నాయక్, విజయ కిషన్ నాయక్,సాయి రెడ్డి గూడెం సర్పంచ్ కొంగళ్ళ అనిత కృష్ణ, కడ్తల్ సర్పంచ్ భిక్షపతి, గానుగుమర్ల తండా సర్పంచ్ సేవ్య నాయక్, గ్రామ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుదీర్ రెడ్డి, పాపిరెడ్డి,మాజీ సర్పంచ్ శంకర్, ఎడ్ల యాదయ్య, క్యాతిక వెంకటేష్,సిలివేరు శ్రీరాములు,బజ్య శ్రీను, సిలివేరు శేఖర్, భరత్ యాదవ్, రావుల రాజా గౌడ్, గ్రామస్తులు, భక్తులు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
