

భారత న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానం కలిగినది భారత సుప్రీంకోర్టు. దేశంలోని రాజ్యాంగాన్ని కాపాడే, ప్రతి పౌరుడి హక్కుల రక్షకంగా ఇది నిలుస్తుంది. పౌర, క్రిమినల్, వాణిజ్య కేసుల కోసం చివరి తీర్పు ఇవ్వగల అతి ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో, మొత్తం 33 మంది న్యాయమూర్తులు సమగ్రంగా పని చేస్తూ, దేశ న్యాయవ్యవస్థకు దారి చూపుతున్నారు. ప్రజల న్యాయాన్ని, రాజ్యాంగ గౌరవాన్ని సురక్షితం చేయడంలో సుప్రీంకోర్టు భారత ప్రజలకి ఆశ్రయం, విశ్వాసం మార్గం.
భారత ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి,న్యాయవ్యవస్థకు ప్రతీకగా నిలిచిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ మన దేశంలో భారత న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థాయి అధికారి.ప్రస్తుతం భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు.
07 అక్టోబర్ 2025 రోజున ఆయనపై జరిగిన దాడియత్నం భారత చరిత్రలో చీకటి పుటలా నిలుస్తుంది.
దేశ సర్వోన్నత న్యాయస్థాయనం అయినటువంటి సుప్రీంకోర్టు లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ వివిధ కేసులను విచారిస్తున్న సమయంలో రాకేశ్ కిశోర్ అనే 71 ఏళ్ల న్యాయవాది, తన కాలుకు ఉన్న బూటును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయి మీదికి విసర బోయాడు. వెంటనే భద్రత సిబ్బంది అప్రమత్తమయి అతనిని అడ్డుకున్నారు.
ఆ సమయంలో జస్టిస్ బి.ఆర్ గవాయ్ అత్యంత మనోనిబ్బరంతో ఈ విదంగా స్పందించారు “ఇలాంటి బెదిరింపులు నా దృష్టిని మళ్లించలేవు. నా పనితీరును ప్రభావితం చేయలేవు. మిగతా లాయర్లు తమ వాదనలను కొనసాగించాలి” అని ఆయన స్పష్టంగా తెలిపారు. ఈ మాటలు ఆయన యొక్క గంభీరథను, ధైర్యాన్ని, స్థిరత్వాన్ని, న్యాయ స్వతంత్రతకు ప్రతికగా నిలుస్తుంది.
ఈ దాడి కేవలం వ్యక్తిగత దాడి కాదు, ఇది సుప్రీంకోర్టు పైన, రాజ్యాంగం పైన, ప్రజాస్వామ్యం పైన, న్యాయవ్యవస్థ పైన జరిగిన దాడిగా న్యాయ నిపుణులు అభివర్ణిస్తున్నారు
జస్టిస్ బి.ఆర్. గవాయ్ 1960 నవంబర్ 24న అమరావతిలో జన్మించి, 1985లో బార్‌లో చేరారు. మొదట మాజీ అడ్వకేట్ జనరల్ మరియు హైకోర్టు న్యాయమూర్తి దివంగత బార్ రాజా ఎస్. భోంస్లేతో పనిచేసారు. తరువాత స్వతంత్రంగా బాంబే హైకోర్టులో ప్రాక్టీస్ చేసి, రాజ్యాంగ, పరిపాలనా చట్టంలో అనుభవం సంపాదించారు. 1992–1993లో నాగ్‌పూర్ హైకోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేశారు. 2000లో ప్రభుత్వ ప్లీడర్, 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2005లో బాంబే హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019లో భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు, 2025లో ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ బి.ఆర్ గవాయ్ గత ఆరు సంవత్సరాలలో సుమారు 700 ధర్మాసనాల్లో కేసులు విచారించి, దాదాపు 300 తీర్పులు ఇచ్చారు. ఆయన ప్రధానంగా పౌరుల హక్కులు, మానవ హక్కులు, రాజ్యాంగం, పరిపాలనా చట్టం, క్రిమినల్, వాణిజ్య, విద్య, పర్యావరణ అంశాలను కాపాడే తీర్పులు ఇచ్చారు. అంతర్జాతీయంగా ఉలాన్‌బాతర్, న్యూయార్క్, కార్డిఫ్, నైరోబి నగరాల్లో సమావేశాలు, కొలంబియా, హార్వర్డ్ వంటి విశ్వవిద్యాలయాల్లో ఉపన్యాసాలు ఇచ్చి భారత న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను ప్రపంచానికి చూపించారు. 2025 నవంబర్ 23న ఆయన పదవీ విరమణ చేయనున్నారు.
మేధావులు, సామాజిక పరిశోధకులు, సామాన్య ప్రజలలో ఒక రకమైన ఆందోళన, చర్చ వినిపిస్తోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ పై జరిగిన దాడి వెనుక ఒకే కారణమా ఆయన దళిత వర్గానికి చెందిన వారు అనేనా? దేశ రాజ్యాంగానికి, న్యాయవ్యవస్థకు ప్రతీకగా నిలిచిన, న్యాయం కోసం జీవితం కట్టుబడి ఉన్న వ్యక్తిని కులం ఆధారంగా తక్కువగా అంచనా వేయడం, ఇలాగే దాడికి గురిచేయడం దేశ ప్రజల హృదయాలను కరిగిస్తుంది. ఆవేదనను రేకెత్తిస్తుంది. నిజానికి ఒకే ప్రశ్న మన ముందు నిలుస్తోంది – ఒక అగ్రవర్ణ ప్రధాన న్యాయమూర్తిగా ఉంటే కాలుకు వేసుకున్న బూటుతో ఇలాంటి దాడి చేయాలనే ఆలోచన వచ్చేదా? ఈ ఆలోచనతో మనలో ఆగ్రహం, విచారం, బాధ కలిగిస్తుంది. రాజ్యాంగం, న్యాయవ్యవస్థ పట్ల మన గౌరవం, బాధ్యత ఎంతగా అవసరమో మళ్లీ మనకు స్పష్టంగా తెలుస్తుంది. మన దేశంలోని ప్రతి పౌరుడు, ప్రతి యువతీ యువకుడు, ప్రతి న్యాయవాది ఈ సంఘటనను గుర్తుంచుకుని, ఈ విలువలను కాపాడే కర్తవ్యం మనపై ఉన్నది అని గుర్తించాలి.
భారతీయ న్యాయచరిత్రలో ఇలాంటి ఘటనలు కొత్తవి కావు. 1968లో అప్పటి సీజేఐ జస్టిస్ హిదయతుల్లా, జస్టిస్ గ్రోవర్, జస్టిస్ వేదలింగంలపై మతిస్థిమితం లేని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఆ దుర్ఘటనలో జస్టిస్ గ్రోవర్ గాయపడ్డారు. భయానక పరిస్థితుల్లోనూ జస్టిస్ హిదయతుల్లా నిబ్బరంగా వ్యవహరించి, పోలీసులకు “దుండగుణ్ని కొట్టవద్దు” అని సూచించారు.
రాకేశ్ కిశోర్ వంటి వ్యక్తుల చర్యలు దేశ న్యాయవ్యవస్థను తలదించుకునేలా చేసింది. కానీ జస్టిస్ బి.ఆర్. గవాయ్ ధైర్యం, స్థిరత్వం దేశ ప్రజల మనసుల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసం, గౌరవం మరింత బలపరుస్తుంది. బి.ఆర్. గవాయ్ ధైర్యం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిగా నిలుస్తుంది.
బి.ఆర్ గవాయి మీద దాడికి పాల్పడడానికి పూనుకున్న రాకేష్ కిషోర్ అనే నిందితున్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అతని లాయర్ లైసెన్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. నిందితుడిని కఠిన చట్టపరమైన శిక్షలు విధించాలి. అవసరమైతే దేశద్రోహిగా గుర్తించడం అత్యవసరం. ప్రతి భారతీయుడు, ప్రతి న్యాయవాది, ప్రతి పౌరుడు ఈ సంఘటన ద్వారా ఒక స్పష్టమైన పాఠం తెలుసుకోవాలి. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ గౌరవం ప్రతి ఒక్కరికి కట్టుబడి ఉండాలి.
ఈ సంఘటనలో మనం ఒక గొప్ప పాఠాన్ని గుర్తించాలి ప్రపంచ మేధావి, భారతరత్న, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మాటలు మన హృదయాలను కదిలిస్తాయి “రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులను మనం గౌరవించలేకపోతే, మన దేశ ప్రజాస్వామ్యం నిలవదు.”
రాజ్యాంగాన్ని కాపాడటం, న్యాయవ్యవస్థకు గౌరవం చూపించడం ప్రతి భారతీయుడి బాధ్యత. జస్టిస్ బి.ఆర్. గవాయ్ పై జరిగిన దాడి మనలో ఆవేదన, ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది. ఎవరూ వ్యక్తిగతంగా, కులం, వర్గం, అభిప్రాయం ఆధారంగా రాజ్యాంగానికి, న్యాయవ్యవస్థకు విరుద్ధంగా వ్యవహరించకూడదు. మనం ఒక్కొక్కరిగా, సమూహంగా నిలబడాలి, రాజ్యాంగాన్ని, న్యాయవ్యవస్థను కాపాడాలి.ఇలాంటివి మాత్రమే మన ప్రజాస్వామ్యాన్ని సుస్థిరంగా నిలుపుతాయి.
జస్టిస్ గవాయ్ దైర్యం ప్రతి భారతీయుడికి ఒక ఆదర్శం. సుప్రీంకోర్టులో జరిగిన దాడి ప్రతి మనిషి, యువత, న్యాయవాది, రాజకీయ నాయకుడు, సామాజిక నాయకుడు ఒక్కటై, భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ గౌరవాన్ని భద్రపరచే బాధ్యతను తెలుసుకోవాలి. దేశ ప్రజలలో భయానికి స్థానం లేదు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ భద్రంగా ఉండటమే మన కర్తవ్యం.
జస్టిస్ గవాయ్ స్థిరత్వం, ధైర్యం, మరియు నాయకత్వం దేశానికి స్ఫూర్తి. ఆందోళన, భయాన్ని ఎదుర్కోవడం కాకుండా, కేసుల విచారణను కొనసాగించడం, భద్రతా సిబ్బందిని సమర్థవంతంగా నిర్వాహించడం ఆయన ప్రతిష్టను మరింత పెంచింది. రాజకీయ నేతలు, న్యాయవాదుల సంఘాలు, సీనియర్ న్యాయవాదులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. సుప్రీంకోర్టు, న్యాయవ్యవస్థ గౌరవానికి, ప్రజాస్వామ్యానికి ఎవరూ ఎదురుగా నిలబడరాదని స్పష్టంగా ప్రకటించారు.
గతంలో జరిగిన సంఘటనలు చూస్తే, న్యాయమూర్తులపై వ్యక్తిగత దాడులు, బెదిరింపులు చోటుచేసుకున్నప్పటికీ, వారు ధైర్యంగా వ్యవహరించి, న్యాయవ్యవస్థను కాపాడారు. జస్టిస్ అరిజిత్ పసాయత్ పై మహిళ చెప్పు విసిరిన ఘటన, ఇతర సీజేఐలపై మానసిక ఒత్తిడి, భౌతిక దాడులు ఎదురయ్యాయి. అందులోనూ న్యాయమూర్తులు ధైర్యంగా వ్యవహరించి, వ్యవస్థను రక్షించారు. జస్టిస్ గవాయ్ కూడా అదే విధంగా, కేసుల విచారణను కొనసాగిస్తూ, సంఘటనపై ఆందోళన చెందకుండా ప్రతిస్పందించారు. “ఇలాంటి బెదిరింపులు నా దృష్టిని మళ్లించలేవు. నా పనితీరును ప్రభావితం చేయలేవు” అని స్పష్టం చేశారు.
భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థను కాపాడడం ప్రతి భారతీయుడి కర్తవ్యం. జస్టిస్ గవాయ్ ధైర్యం, స్థిరత్వం, నాయకత్వం దేశం మొత్తం కోసం ప్రేరణ. సుప్రీంకోర్టు, న్యాయవ్యవస్థ, రాజ్యాంగం పై ఎవరూ దాడి చేయనివ్వకూడదు. దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి, దేశద్రోహిగా ప్రకటించాలి.
ప్రజలు, విద్యార్థులు, న్యాయవాదులు, రాజకీయ నేతలు ఒక్కటై, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, న్యాయవ్యవస్థ గౌరవాన్ని భద్రపరచడం కర్తవ్యం. ఈ సంఘటన భవిష్యత్తు తరాలకు ఒక పాఠం రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్యం సులభంగా క్షీణించబడవు. జస్టిస్ బి.ఆర్. గవాయ్ గారి ధైర్యం, స్థిరత్వం, నాయకత్వం భారత ప్రజలకు, ముఖ్యంగా యువతకు స్ఫూర్తి.
సుప్రీంకోర్టు, న్యాయవ్యవస్థ గౌరవం, ప్రజాస్వామ్యం కోసం సమాజం ఒక్కటై నిలబడాలి. ప్రతి భారతీయుడు, ప్రతి లాయర్, ప్రతి యువత ప్రతినిధి రాజ్యాంగాన్ని, న్యాయవ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని భద్రపరచడం కర్తవ్యం. జస్టిస్ గవాయ్ గారి నాయకత్వం, ధైర్యం, స్థిరత్వం, నిబద్ధత భారతదేశానికి ఒక వెలుగునిగా నిలుస్తుంది. దేశ భవిష్యత్తు తరాలకు, యువతకు, సమాజానికి, న్యాయవ్యవస్థకు ఆదర్శంగా మారుతుంది.
భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, న్యాయవ్యవస్థ కాపాడుకోవడం కోసం మనందరం కళ్లను తెరవాలి. మనం ఒక్కటై నిలబడినప్పుడు మాత్రమే, ఈ మూలస్థంభం, ప్రజాస్వామ్య పునాది, రాజ్యాంగ గౌరవం సుస్థిరంగా ఉంటుంది..

356fmg