సమ్మక్క సారక్క ఉద్యమ స్ఫూర్తితో ఆదివాసీ హక్కుల పరిరక్షణే ద్యేయం

ఓయూ విద్యార్థి సంఘాల భారీ ర్యాలీ, ప్లకార్డుల ప్రదర్శన

సేవ్ ఆదివాసీ -సేవ్ కాన్స్టిట్యూషన్ నినాదంతో ఓయూలో సమ్మక్క సారక్క ఉద్యమ స్పూర్తితో ఆదివాసీ హక్కుల పరిరక్షణకు విద్యార్థి సంఘాల ప్లకార్డుల ప్రదర్శన మరియు భారీ ర్యాలీ.

ధర్మఘంట, ఫిబ్రవరి 03, హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మంగళవారం ఆదివాసీ, దళిత, బహుజన, వామపక్ష, మైనారిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో “సేవ్ ఆదివాసీ – సేవ్ కాన్స్టిట్యూషన్” నినాదంతో ప్లకార్డుల ప్రదర్శన మరియు భారీ ర్యాలీ కార్యక్రమం నిర్వహించబడింది. అడవుల నరికివేత, భూకబ్జాలు, కార్పొరేట్ దోపిడీ పేరుతో ఆదివాసీల జీవన హక్కులు బహిరంగంగా కాలరాయబడుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓయూ ఆదివాసీ ప్రొఫెసర్లు డాక్టర్ ఆప్కా నాగేశ్వరరావు, డాక్టర్ గుమ్మడి అనురాధ, ఆమంచి నాగేశ్వరరావు, ప్రో. మాయ దేవి, హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ, అడవికి ఆదివాసులకు ఉన్న అవినాభావ సంబంధమే మేడారం సమ్మక్క సారలమ్మ ఉద్యమ పోరాటానికి స్పూర్తి అని పేర్కొన్నారు. సమాజంలో అణగారిన వర్గాల గొంతుకగా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్లు ముందుండి ఆదివాసీ ప్రజలకు అండగా నిలవడం యావత్ ఆదివాసీ సమాజం తరఫున అభినందనీయమని అన్నారు. సాంస్కృతిక పోరాటాల ద్వారానే ఆదివాసీ ప్రజలకు సోషల్ జస్టిస్, సరైన ఐడెంటిటీ, హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆదివాసీ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కానీ నేటి పాలకులు ఈ చట్టాలను ఉల్లంఘిస్తూ ఆదివాసీ ప్రజలను అడవుల నుంచి దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ ప్రాంతాలను విధ్వంసం చేయడం అంటే ఆదివాసీ ప్రజల లైఫ్ స్టైల్‌ను, ఫారెస్ట్ రిసోర్సెస్‌ను కార్పొరేట్ శక్తులకు అప్పగించడమేనని తీవ్రంగా విమర్శించారు.

డీబీఎస్‌ఏ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ నలిగంటి శరత్ చమార్ మాట్లాడుతూ, ఆదివాసీ అమరవీరుల పోరాట స్పూర్తితో సమ్మక్క సారలమ్మ సాంస్కృతిక స్ట్రగుల్‌ను కొనసాగించాలని పిలుపునిచ్చారు. మాతృస్వామ్య మమతను, ఆదివాసీ కల్చర్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆదివాసీ దళిత బహుజన,వామపక్ష మైనారిటీ స్టూడెంట్లపై ఉందని గుర్తు చేశారు. అడవి, భూమి, మినరల్ రిసోర్సెస్ లేకుండా ఆదివాసీల జీవితం జీవం లేని దేహంతో సమానమని అన్నారు.

ఆదివాసీ వీరవనితలు సమ్మక్క సారలమ్మల ప్రతిరూపాన్ని ఏర్పాటు చేసి వారి ఉద్యమ పోరాట స్పూర్తిని కొనసాగిస్తామని భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణను ప్రకటించి, ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్, ఆదివాసీ రైట్స్ ప్రొటెక్షన్, కాన్స్టిట్యూషన్ వాల్యూస్ ప్రొటెక్షన్ కోసం ఈ ఉద్యమాన్ని అన్ని వర్గాల ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని,ఆదివాసీల రక్షణే కాన్స్టిట్యూషన్ రక్షణ, కాన్స్టిట్యూషన్ రక్షణే డెమోక్రసీ రక్షణ అని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు.

ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు సాగబోయిన పాపారావు,మాజీ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. ఎల్. మూర్తి, బి.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల సంజయ్ ఏఐఎస్‌ఎఫ్ ఓయూ ప్రెసిడెంట్ ఉదయ్,టి.ఎస్. పి జాక్ అధ్యక్షుడు వలిగొండ నరసింహ,జార్జిరెడ్డి పి.డి.ఎస్.యూ రాష్ట్ర అధ్యక్షుడు ఏస్. నాగేశ్వరరావు, డి.ఎస్.పి విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ మేడి కార్తీక్,, డి.బి.ఎస్.ఏ స్టేట్ కో ఆర్డినేటర్ జంగిలి దర్శన్, అంసా ఓయూ అధ్యక్షుడు నామ సైదులు, బి.ఆర్.ఎస్.వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య, ఎన్. ఎస్.యూ.ఐ ఓయూ అధ్యక్షుడు మెడ శ్రీను, జార్జిరెడ్డి, పి.డి.ఎస్.యూ కార్యదర్శి సుమంత్, ఓయూ జాక్ అఖిల్, పూలే అంబేద్కర్ యువజన సంగం రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ అంబేద్కర్, డిబిఎస్ఏ విద్యార్థి నాయకులు సైదులు, ప్రణయ్, రవీందర్, మహేష్,రాజు, ఆదివాసీ విద్యార్థి సంగం అరుణ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *