ఓయూ పీహెచ్డీ రీసెర్చ్ స్కాలర్, డి.బి.ఎస్.ఏ స్టేట్ కోఆర్డినేటర్ జంగిలి దర్శన్

ధర్మఘంట, జనవరి 18, ఇబ్రహీంపట్నం: క్రీడలు యువతకు శక్తివంతమైన వేదికలని ఓయూ పీహెచ్డీ రీసెర్చ్ స్కాలర్, డి.బి.ఎస్.ఏ స్టేట్ కోఆర్డినేటర్ జంగిలి దర్శన్ అన్నారు. నేడు రంగారెడ్డి జిల్లా , ఇబ్రహీంపట్నం మండలం, కప్పపహాడ్ గ్రామంలో నిర్వహించిన కే.పి.ఎల్. సీజన్ 5లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఉత్కంఠభరితమైన పోరులో ఘన విజయం పొంది సెమీ ఫైనల్ కు అర్హత సాధించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలు యువతను సానుకూల దిశలో నడిపించే శక్తివంతమైన వేదికలని, వారికి దిశను చూపుతాయని, క్రీడా స్పూర్తి, క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచిన ఈ టోర్నమెంట్ యువతలో విశేష ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో నిర్వహించే ఇలాంటి క్రీడా పోటీలు దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని ఆయన తెలిపారు.
రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించిన సందర్భంగా జట్టు కెప్టెన్ రాజశేఖర్ కు మరియు జట్టు సభ్యులు గ్రామం ఉప సర్పంచ్ రమేష్ కు డి.బి.ఎస్.ఏ స్టేట్ కోఆర్డినేటర్ జంగిలి దర్శన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఉత్తమ ప్రదర్శన చేసిన ఉదయ్ చారికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును జంగిలి దర్శన్ మరియు బి.ఆర్.ఎస్.వి ఇబ్రహీంపట్నం విద్యార్థి విభాగం అధ్యక్షుడు నిట్టు జగదీష్ అలాగే జంగిలి సుధాకర్ చేతుల మీదుగా ఘనంగా అందజేశారు.
ఇలాంటి క్రీడా కార్యక్రమాలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని, ప్రతి గ్రామంలో క్రీడలకు ప్రోత్సాహం అందాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వాలు గ్రామీణ క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ బడ్జెట్ల రూపకల్పన చేయాలని కోరారు.
