పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
ధర్మఘంట ఫిబ్రవరి 01 కోదాడ (గంట సోమన్న,స్టేట్ కోఆర్డినేటర్): సూర్యాపేట జిల్లా కోదాడ ట్టణ పరిధిలోని 27వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఖాజా షరీఫ్ మరియు మహమ్మద్ ఖాలిద్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేసి కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నయీం,షేక్ అబ్బు,మహమ్మద్ షకీర్,పిట్టల భాగ్యమ్మ,అలీం తదితరులు పాల్గొన్నారు.





