RRB ALP Recruitment 2025: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 9000 లకు పైగా అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము, అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం..
RRB ALP Recruitment 2025: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) గత నెల 9970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది . గతంలో దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీని మే 11గా నిర్ణయించారు. కానీ ఇప్పుడు దానిని మే 19 వరకు పొడిగించారు. కనుక ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దరఖాస్తులను RRB అధికారిక వెబ్సైట్ rrbapply.gov.in ద్వారా మే 19 వరకు సమర్పించవచ్చు . అంతేగాక దరఖాస్తు రుసుమును 21 మే 2025 వరకు చెల్లించే వెసులుబాటు కూడా ఉంది. ఫారమ్‌లో దిద్దుబాట్లు చేయడానికి విండో 22 మే 31 నుంచి 2025 వరకు తెరిచి ఉంటుంది.
ఇండియన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులకు 9970 ఖాళీల దరఖాస్తు ప్రక్రియను మే 19 వరకు పొడిగించింది. దరఖాస్తు రుసుమును మే 21, 2025 (రాత్రి 11:59) వరకు చెల్లించవచ్చు. ఫీజు చెల్లింపుకు చివరి తేదీ మే 21, 2025గా నిర్ణయించారు. అభ్యర్థులు ఫారమ్‌లోని లోపాలను సరిదిద్దుకోవడానికి మే 22 నుంచి మే 31, 2025 వరకు సమయం లభిస్తుంది.
అర్హత
ఈ నియామకానికి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. విద్యార్హత ప్రకారం అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుండి మెట్రిక్యులేషన్/SSLCతో పాటు ITI లేదా సంబంధిత ట్రేడ్‌లో 3 సంవత్సరాల డిప్లొమా కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ
ALP పోస్టుకు ఎంపిక నాలుగు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో 60 నిమిషాల్లో 75 ప్రశ్నలు మరియు 1/3 నెగటివ్ మార్కింగ్‌తో కూడిన CBT-1 పరీక్ష ఉంటుంది. దీని తర్వాత, CBT-2 పరీక్ష నిర్వహించబడుతుంది, దీనిలో 175 ప్రశ్నలను 2 గంటల 30 నిమిషాల్లో పరిష్కరించాలి. ఇందులో కూడా 1/3 వంతు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. CBT-2లో విజయం సాధించిన అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT)కి హాజరు కావాలి, దీనికి నెగటివ్ మార్కులు లేవు. చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ ఉంటుంది.
దరఖాస్తు రుసుము
జనరల్, OBC, EWS వర్గాలకు దరఖాస్తు రుసుము రూ. 500. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళలు, ట్రాన్స్జెండర్లు, మైనారిటీలు లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి రుసుము రూ. 250. ఫీజును ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా UPI ద్వారా మాత్రమే ఆన్లైన్లో చెల్లించాలి. అయితే, CBT-1 పరీక్షకు హాజరైన వారికి రూ. 250 తిరిగి చెల్లిస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి?
- ముందుగా RRB అధికారిక వెబ్సైట్ (www.rrbcdg.gov.in) కి వెళ్లండి.
- వెబ్‌సైట్‌ను సందర్శించి, “న్యూ కొత్త రిజిస్ట్రేషన్” పై క్లిక్ చేసి అవసరమైన సమాచారాన్ని ఎంటర్ చేయండి.
- రిజిస్ట్రేషన్ తర్వాత విద్యార్హత, వ్యక్తిగత సమాచారం మొదలైన అన్ని అవసరమైన వివరాలను దరఖాస్తు ఫారమ్‌లో పూరించండి.
- వెబ్సైట్లో సూచించిన విధంగా మీ పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సంతకాన్ని అప్లోడ్ చేయండి.
- చెల్లింపు కోసం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా UPI ఉపయోగించండి.
- ఇప్పుడు దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి దాని ప్రింటవుట్ తీసుకోండి.