దళిత్ బహుజన్  స్టూడెంట్ అసోసియేషన్ (డిబిఎస్ఏ) ఆధ్వర్యంలో ఓయూ లో ఘనంగా  సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు 

ధర్మఘంట, జనవరి 03, హైదరాబాద్: డీ.బీ.ఎస్.ఏ  దళిత్ బహుజన్  స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ బహుజన సంఘాల సమక్షంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ముందు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇఫ్లూ విశ్వవిద్యాలయ అధ్యాపకులు ప్రొఫెసర్ పంథాకాల శ్రీనివాస్ మరియు చరిత్ర విభాగం అధ్యాపకురాలు ప్రొఫెసర్ ఇందిర హాజరై ప్రసంగించారు. 

 సావిత్రిబాయి పూలే జీవితం, ఆమె ప్రారంభించిన విద్యా ఉద్యమం, కులవ్యవస్థ మరియు పురుషాధిక్యతలపై సాగించిన పోరాటాన్ని విశ్లేషిస్తూ, విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. మహిళా విద్య, సామాజిక సమానత్వం, న్యాయసమాజ నిర్మాణంలో సావిత్రిబాయి పూలే పాత్ర చారిత్రాత్మకమని వారు వివరించారు.

డీబీఎస్ఏ రాష్ట్ర కోఆర్డినేటర్, ఓయూ స్కాలర్ జంగిలి దర్శన్  మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే కేవలం ఒక విద్యావేత్త మాత్రమే కాకుండా, బహుజన మహిళల విముక్తికి దీపశిఖగా నిలిచిన మహోన్నత వ్యక్తిత్వమని పేర్కొన్నారు. చదువు అనేది హక్కుగా మారినప్పుడే సమాన సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని, నేటి విద్యార్థులు సావిత్రిబాయి పూలే ఆశయాలను ఆచరణలో పెట్టి సామాజిక మార్పుకు నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. బహుజన ఉద్యమాల ఐక్యత ద్వారానే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమని అన్నారు.

వివిధ బహుజన సంఘాల నాయకులు, విద్యార్థులు, హాజరై, సావిత్రిబాయి పూలే ఆశయాలైన విద్యా సమానత్వం, లింగ సమానత్వం, సామాజిక న్యాయం సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలు విద్యార్థుల్లో చైతన్యాన్ని రేకెత్తిస్తూ, సావిత్రిబాయి పూలే చూపిన మార్గం నేటి తరానికి కూడా ఎంత ప్రామాణికమో మరోసారి స్పష్టంగా చాటిచెప్పాయి.

ఈ కార్యక్రమంలో బీఎస్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు వేల్పుల సంజయ్, జై భారత్ రాష్ట్ర అధ్యక్షులు ముప్పారం ప్రకాష్, మహాజన గళం వ్యవస్థాపక అధ్యక్షుడు సురేష్,  మహాజన బీఎస్యూ వ్యవస్థాపక అధ్యక్షులు కత్తి వీరన్న, టీవీయూవీ వ్యవస్థాపక అధ్యక్షుడు కంచర్ల బద్రి, ఎస్‌ఎస్‌ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజేష్, ఎస్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వేదాంత్ మౌర్య, జై భారత్ గళ్ళ గణేష్,

డీబీఎస్ఏ విద్యార్థి నాయకులు సైదులు, రవీందర్, అజయ్, ఆజాం భాయ్, మహమ్మద్ భాయ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *