జిల్లా ఆధ్యకుడిగా ఎన్నికైన రామసాని రమేష్

సూర్యాపేట, 21 సెప్టెంబర్ 2025 (ధర్మఘంట): మోడ్రన్ కబడ్డీ రాష్ట అధ్యక్షులు కుంబం రాంరెడ్డి ఆదేశాలమేరకు సూర్యాపేట జిల్లా మోడ్రన్ కబడ్డీ కార్యవర్గాన్ని రాష్ట్ర బాధ్యులు, ఎన్నికల ఇన్చార్జి ఆరే తిరుపతి సమక్షంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా రామసాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా మడిపెద్ది రాములు, ట్రెజరర్ గా ఏడుమల శంకయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆరే తిరుపతి తెలిపారు. జిల్లా ఆధ్యకుడిగా ఎన్నికైన రామసాని రమేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మోడ్రన్ కబడ్డీని విస్తరించడానికి, క్రీడాకారుల అభ్యున్నతి తనవంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన కమిటీకి రాష్ట్ర అధ్యక్షులు ( మోడ్రన్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫౌండర్ ) కుంభం రామ్ రెడ్డి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతగింజల రాజారావు శుభాకాంక్షలు తెలియజేయగా, తమ ఎపికకు సహకరించిన వారందరికీ ఎంపికైన వారు కృతజ్ఞతలు తెలిపారు.
