కేటీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా బెంచీలు, సైకిళ్ల పంపిణీ

హైదరాబాద్ 24.07.2025 గురువారం, (ధర్మఘంట):  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, డైన‌మిక్ లీడ‌ర్, మాజీమంత్రి కల్వకుంట్ల రామారావు  (కేటీఆర్)  జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని సామాజిక సేవ‌లో భాగంగా “గిఫ్ట్ ఏ స్మైల్” కార్య‌క్ర‌మాన్ని నేడు మాజీ రాజ్య‌స‌భ స‌భ్యులు జోగినిప‌ల్లి సంతోష్ కుమార్ స‌హ‌కారంతో తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మ‌న్ మేడే రాజీవ్ సాగ‌ర్ బోయిగూడ‌లోని సెయింట్ ఫిలోమెనాస్ హైస్కూల్ లో నిర్వ‌హించారు. 

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిలుగా మాజీ రాజ్య‌స‌భ స‌భ్యులు జోగినిప‌ల్లి సంతోష్ కుమార్, మాజీ మంత్రి, స‌న‌త్ న‌గ‌ర్ ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ పాల్గొని “గిఫ్ట్ ఏ స్మైల్” కార్య‌క్ర‌మంలో భాగంగా పాఠ‌శాల విద్యార్థుల‌కు 100 బెంచీలు,  అదే విదంగా 6వ త‌ర‌గ‌తి నుంచి 10 వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువులో మొద‌టి రెండు స్థానాల్లో ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన‌ విద్యార్ధినీ విద్యార్థుల‌కు 20 సైకిళ్లను పంపిణీ చేశారు.

అనంత‌రం కేటీఆర్  ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని పాస్ట‌ర్ల‌తో ప్ర‌త్యేక ప్రార్ధ‌న‌లు నిర్వ‌హించి, కేక్ క‌ట్ చేసి కేటీఆర్ కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

ఈ సంద‌ర్బంగా గ్రీన్ ఇండియా ఛాలేంజ్ కార్య‌క్ర‌మంలో భాగంగా పాఠశాల ఆవ‌ర‌ణ‌లో  మొక్క‌లు నాట‌డం జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మంలో మాజీ కార్పోరేష‌న్ చైర్మ‌న్లు మ‌సీవుల్లా, బాల్ రాజ్ యాద‌వ్, మంత్రి శ్రీదేవి, బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్, కిషోర్ గౌడ్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు సుమిత్ర తనోబా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స‌భ్యులు రాఘ‌వ‌, స‌తీష్, బోజా నారాయ‌ణ‌, సెయింట్ ఫిలోమెనాస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఫాద‌ర్ ఉద‌య్ భాస్క‌ర్, ఫాద‌ర్ క్రాంతి కుమార్, బిష‌ప్ నెహెమియా, కెప్టెన్ సునీల్, కార్పోరేట‌ర్ కూర్మ హేమ‌ల‌త‌, డివిజ‌న్ ప్రెసిడెంట్ వెంక‌టేష్ రాజ్, మైనార్టీ సెల్ నాయ‌కులు జై రాజ్, క్యాథ‌లిక్ చ‌ర్చి అసోసియేష‌న్ జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీ లియో లూయిస్, క్రిస్టియ‌న్ జెఎసీ చైర్మ‌న్ స్మాల‌న్ రాజ్, మైనార్టీ నాయ‌కులు రాజేంద‌ర్, మోజెస్, ప్ర‌ణ‌య్, శేఖ‌ర్, ప్ర‌శాంత్, బ‌ద్రుద్దీన్, బ‌న్నీల‌తో పాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *