77వ గణతంత్ర దినోత్సవానికి అర్థవంతమైన కానుక  

ఎం.పి.యు.పి.ఎస్ కప్పహాడ్ పాఠశాల విద్యార్థులకు జంగిలి ప్రశాంత్ రూ.10,000/- విరాళం

ధర్మఘంట, జనవరి 26, ఇబ్రహీంపట్నం : 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యాభివృద్ధే లక్ష్యంగా ఎం.పి.యు.పి.ఎస్ కప్పహాడ్ పాఠశాల విద్యార్థులకు స్థానిక యువ నాయకుడు ఉస్మానియా డీకార్డియో జంగిలి ప్రశాంత్ రూ.10,000/- విలువైన చెక్కును విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించబడింది.

ఈ సందర్భంగా జంగిలి ప్రశాంత్  మాట్లాడుతూ, పేద మరియు ప్రతిభావంతులైన విద్యార్థులకు విద్య అత్యంత కీలకమని, వారి భవిష్యత్తు ఉన్నతంగా ఎదగాలంటే సమాజం మొత్తం కలిసి సహకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ విరాళం ద్వారా విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, విద్యా సామగ్రి సమకూర్చేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని విద్యా, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు తాను ముందుంటానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ యువ నాయకులు జంగిలి మహేష్, జంగిలి లింగం, జంగిలి దయాకర్, జంగిలి జీవన్, బుద్ధుల ప్రవీణ్, చతల్ల ప్రవీణ్, జంగిలి విజయ్ పాల్గొన్నారు. అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

గణతంత్ర దినోత్సవాన్ని విద్యార్థుల భవిష్యత్తుకు అంకితం చేస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం అందరి మనసులను ఆకట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *