దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ (DBSA) ఆధ్వర్యంలో పెరియార్ 146వ జయంతి

హైదరాబాద్, 16 సెప్టెంబర్ 2025 (ధర్మఘంట): స్వేచ్ఛ, సమానత్వ-ఆత్మగౌరవ ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ద్రావిడ సాంస్కృతిక – సామాజిక ఉద్యమ మహానాయకుడు పెరియార్ ఇ.వి. రామస్వామి నాయకర్ 146వ జయంతి మహోత్సవ కార్యక్రమం దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ (DBSA) ఆధ్వర్యంలో రేపు, అనగా  సెప్టెంబర్ 17వ తేది బుధవారం మధ్యాహ్నం 1:00 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ లోని న్యూ సెమినార్ హాల్ నందు ఘనంగా, చారిత్రాత్మకంగా నిర్వహస్తున్నట్లు దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ (DBSA) స్టేట్ కోఆర్డినేటర్, ఉస్మానియా యూనివర్సిటీ PhD రీసెర్చ్ స్కాలర్ జంగిలి దర్శన్ ఒక ప్రకటనలో తెలిపారు

ఈ మహోత్సవంలో పెరియార్ ఆశయాలను మరింత బలంగా సమాజంలో విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రొఫెసర్లు, మేధావులు, కవులు, రచయితలు, వాగ్గేయకారులు, సామాజిక ఉద్యమకారులు తమ విలువైన ఆలోచనలు పంచుకోనున్నారని, పెరియార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం – అతనికి మనం అందించే నిజమైన గౌరవం, మనందరి బాధ్యత అని, ఈ జయంతి మహోత్సవం మనందరి ఉత్సవం, మనందరి గౌరవం. కాబట్టి ప్రతి ఒక్కరూ హాజరై పెరియార్ ఆశయాలను సమాజంలో బలపరచాలని ఆహ్వానిస్తున్నామని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *