
సీఎం రేవంత్ రెడ్డికి మంత్రుల అభినందనలు
ధర్మఘంట, ఫిబ్రవరి 03, హైదరాబాద్ : హార్వర్డ్ యూనివర్సిటీలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక “లీడర్‌షిప్ ఇన్ ద 21వ శతాబ్దం” ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన గౌరవనీయ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కేబినెట్ మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి నివాసాన్ని సందర్శించి సీఎం రేవంత్ రెడ్డిని హృదయపూర్వకంగా అభినందించారు.
అంతర్జాతీయ స్థాయిలో నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించే ఈ కార్యక్రమం తెలంగాణ పాలనకు మరింత బలాన్నిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ధనసరి అనసూయ సీతక్క, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, మొహమ్మద్ అజారుద్దీన్ పాల్గొన్నారు.
అలాగే ముఖ్యమంత్రి సలహాదారు వేమ్ నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హార్వర్డ్‌లో పొందిన నాయకత్వ అనుభవాన్ని రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం మరియు పారదర్శక పాలన కోసం వినియోగిస్తామని తెలిపారు
